తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

వాస్తు ప్రకారం- వాటర్‌ ట్యాంక్‌ ఈ దిశలో ఉండకపోతే కష్టాలు గ్యారంటీ!! - Vastu Tips in telugu

Vastu Tips For Water Tank : హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలా మంది ఇంటి నిర్మాణం నుంచి మొదలు, ఇంట్లో వస్తువులు ఏర్పాటు చేసే విషయంలో కూడా వాస్తును పక్కాగా పాటిస్తారు. అయితే వాటర్​ ట్యాంక్​ విషయంలో కూడా వాస్తు పాటించాలని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Vastu Tips For Water Tank
Vastu Tips For Water Tank

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 12:34 PM IST

Vastu Tips For Water Tank :భారతదేశంలోచాలా మంది వాస్తు నియమాలను పాటిస్తారు. ముఖ్యంగా ఏదైనా కొత్తగా నిర్మాణాలు చేపట్టినప్పుడు కచ్చితంగా వాస్తు ప్రకారమేనడుచుకుంటారు. అంతేకాకుండా ఇంట్లో ఉంచే వస్తువుల విషయంలో కూడా వాస్తును పాటిస్తారు.ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని, ధనలాభం, శాంతి వంటివి కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే వాటర్​ ట్యాంక్​ విషయంలో కూడా వాస్తును పాటించాలని అంటున్నారు నిపుణులు. నూతనంగా ఇంటిని నిర్మించాలనుకునే వారు బోర్ ఎక్కడ వేయాలి ? అండర్‌ గ్రౌండ్‌లో వాటర్‌ ట్యాంక్‌ను ఎక్కడ నిర్మించాలి ? అనే విషయాలపై వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ఎక్కడ ఉండాలి ?:ప్రస్తుతం అండర్​ గ్రౌండ్​ వాటర్​ ట్యాంకుల నిర్మాణాలు ఎక్కువయ్యాయి. అయితే వాస్తు ప్రకారం అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్‌ను ఈశాన్య దిక్కున నిర్మించాలంటున్నారు నిపుణులు. అది కూడా తూర్పు, ఉత్తర గోడలకు తగలకుండా నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేస్తున్నారు. అలాగే అండర్​ గ్రౌండ్​ వాటర్​ ట్యాంకును నైరుతి, ఆగ్నేయ, వాయువ్య, దక్షిణ, పడమర దిశలో నిర్మిస్తే ఇంట్లో గందరగోళం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారని, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

వాటర్‌ ట్యాంక్ :ఇంటి స్లాబ్‌పై ఏర్పాటు చేసుకునే వాటర్‌ ట్యాంక్‌ నీటితో ఉండటం వల్ల చాలా బరువుగా ఉంటుంది. అయితే, వాస్తు ప్రకారం నీళ్ల ట్యాంక్​ను నైరుతి దిశలో ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు. ఒకవేళ ఈ దిశలో పెట్టడం కుదరకపోతే పశ్చిమాన లేదా దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో వాటర్‌ ట్యాంక్‌ ఉండకూడదని.. అంతేకాకుండా ఈ దిక్కులో ఉంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు కలుగుతాయని అంటున్నారు.

బోర్‌ ఏ దిశలో వేయించాలి ?:వాస్తు ప్రకారం ఇంటి స్థలంలో బోర్లు వేయించాలి అనుకునే వారు లేదా బావులు తవ్వించాలనుకునేవారు తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలంటున్నారు. అలా వీలు కానీ సమయంలో ఉత్తరం దిశలో ఉండేలా చూసుకోమంటున్నారు. అలాగే ఈ బోర్‌వెల్‌/బావి కచ్చితంగా చదరపు, దీర్ఘచతురస్రాకారం లేదా వృత్తాకారంగా ఉండాలని అంటున్నారు. కాగా బోర్‌వెల్‌/బావి ఆగ్నేయం, దక్షిణం, నైరుతి దిశలో ఉంటే ఆ ఇంట్లో అశాంతి, కలహాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

మీ బాత్‌రూమ్‌ ఇలా ఉంటే - వాస్తు దోషం చుట్టుముడుతుంది!

గణపతి విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారా? - ఈ రూపంలోనివి ఇవ్వకూడదట!!

మీ అపార్ట్‌మెంట్లో వాస్తు దోషం - ఇలా తొలగించండి!

ABOUT THE AUTHOR

...view details