Avoid These Vastu Mistakes to Saving Money :ప్రతి ఒక్కరూ సంపాదన మెరుగుపరుచుకొని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలవాలని కోరుకుంటారు. అందుకోసం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడుతుంటారు. కానీ.. ఎంత డబ్బు సంపాదించినా రూపాయి నిలవడం లేదు అంటారు మెజార్టీ జనం! ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి ఇంట్లో డబ్బును సరైన స్థలంలో ఉంచకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మరి.. ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రతికూల ప్రభావం : చాలా మంది బీరువాలో డబ్బుతో పాటు కొన్ని విలువైన పత్రాలు, రికార్డులను దాచి పెడుతుంటారు. కొందరు మాత్రం బీరువాలో మనీతో పాటు కొన్ని ప్రతికూల ప్రభావం చూపే పత్రాలను స్టోర్ చేస్తుంటారు. అంటే.. కోర్టు కేసు పత్రాలు లేదా కుటుంబ వివాదాలకు సంబంధించిన పత్రాలను ఉంచుతుంటారు. అయితే.. వాస్తుప్రకారం ఇలాంటి పత్రాలను డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచడం మంచిది కాదంటున్నారు వాస్తు పండితులు. అది అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుందని చెబుతున్నారు.
చిరిగిన నోట్లు :ఎక్కువ మంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. చిరిగిన నోట్లను కూడా బీరువాలో దాస్తుంటారు. కానీ.. వాస్తుప్రకారం పొదుపు చేసే డబ్బుతో కలిపి పాత, చిరిగిన నోట్లను ఉంచడం మంచిది కాదంటున్నారు వాస్తుపండితులు. ఇది కూడా డబ్బు నిల్వకపోవడానికి కారణం కావొచ్చంటున్నారు. కాబట్టి, మీ దగ్గర అలాంటి చిరిగిన నోట్లు ఉంటే వాటిని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. లేదా బ్యాంకుకు వెళ్లి ఆ నోట్లను మార్పిడి చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.
డబ్బు ఉంచే ప్రదేశం రంగు : వాస్తుప్రకారం మీరు నగదు దాచే ప్రదేశం రంగు కూడా డబ్బు నిల్వకపోవడానికి కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు. అందుకే.. డబ్బును ఉంచే ప్రదేశం రంగు విషయంలో జాగ్రత వహించాలంటున్నారు. వాస్తుప్రకారం.. మీరు డబ్బు బీరువాలో ఉంచితే.. బీరువాకు మెటాలిక్ రంగు ఉండడం శుభప్రదమని చెబుతున్నారు. అలాగే.. మెటల్, గోల్డ్ లేదా లేత బూడిద రంగు కలిగి ఉన్న అల్మరాలను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు. కానీ, నలుపు లేదా ముదురు ఎరుపు రంగు వాటిని ఎప్పుడూ వాడకూడదంటున్నారు.