Avoid These Things in Kitchen As Per Vastu :వంటిగది విషయంలో కొన్ని వాస్తు నియమాలను తప్పక పాటించాల్సిన అవసరముందంటున్నారు వాస్తు పండితులు. లేదంటే.. నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని.. ఫలితంగా కుటుంబ అభివృద్ధి దెబ్బతింటుందని, ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాడైపోయిన ఫుడ్ :పాడైన ఆహారం వంటింట్లో ఉంచుకోవడం మంచిదికాదట. దానివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చేరి వివిధ సమస్యలను సృష్టించే ఛాన్స్ ఉంటుందట. అలాగే పనికిరాని పదార్థాలు, వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దంటున్నారు. వీటి కారణంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉండవచ్చంటున్నారు వాస్తు పండితులు.
వాస్తు ప్రకారం వంటగదికి ఏ రంగు పెయింట్ వేయాలి? మిక్సీ అక్కడ పెట్టొచ్చా?
అవి ఖాళీగా ఉండొద్దు :ఇంట్లో చిరుధాన్యాలు, ఇతర వంట సామగ్రి స్టోర్ చేసుకునే డబ్బాలు, సీసాలు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా చూసుకోవాలట. ఎందుకంటే.. ఖాళీ డబ్బాలు ఇంట్లో లేమిని సూచిస్తుందంటున్నారు వాస్తు పండితులు. ఒకవేళ ఉంటే.. వాటిని ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవడం మంచిదట.
ఎలక్ట్రానిక్ వస్తువులు : వంటగదిలో పనిచేయని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రి ఉండకుండా జాగ్రత్త పడాలంటున్నారు. వాడని వంటగది సామగ్రి వల్ల ఇంట్లోకి సంపద రాదట. కాబట్టి, అలాంటివి ఉంటే వెంటనే తొలగించి.. వీలైనంత సింపుల్‌గా ఉంచుకోవడం మంచిదంటున్నారు.
వాటి వినియోగంలో జాగ్రత్త :కిచెన్‌లో ఉపయోగించే కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువుల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా వాటికై కేటాయించిన ప్లేస్‌లలో వాటిని భద్రపరచుకోవాలట. ఎందుకంటే.. అవి సరైన ప్లేస్‌లో లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చంటున్నారు.
విరిగిన, పగిలిన పాత్రలు :వాస్తుప్రకారం.. వంటగదిలో ఎప్పుడూ విరిగిన, పగిలిన పాత్రలను ఉపయోగించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. అవి కిచెన్‌లో ఉంచడం వల్ల నెగిటివిటీ వ్యాపిస్తుందని.. దాని కారణంగా ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, అప్పులు పెరుగుతాయంటున్నారు. కాబట్టి, వాటి స్థానంలో ఎప్పుడూ కొత్తవి తెచ్చుకోవడం మేలు చేస్తుందని చెబుతున్నారు.
అదేవిధంగా.. వంటగదిలో మందులను ఉంచకూడదంటున్నారు. ఎందుకంటే.. ఇవి కిచెన్‌లో ఉంచడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంటుందట. ఇనుము లేదా ఉక్కు పాత్రలు, డబ్బాలలో ఉప్పును నిల్వ చేయకుండా జాగ్రత్త పడాలంటున్నారు. వీటితోపాటు కిచెన్ ఎల్లప్పడూ క్లీన్‌గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుందని, లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థికంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వంటగదిలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - పిల్లల అనారోగ్యానికి కారణం ఇవే కావొచ్చు!