Vastu Tips for Career Growth :ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. కెరీర్లో పురోగతి సాధించడం కోసం చాలా మంది ఎన్నో అవస్థలు పడుతుంటారు. అయితే.. కొందరు ఎంత కష్టపడి పని చేసినా అనుకున్న స్థానాన్ని పొందలేకపోతారు. దాంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు కొన్ని వాస్తు టిప్స్(Vastu) పాటించడం ద్వారా.. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎలక్రానిక్ వస్తువుల దిశ : ఇల్లు, ఆఫీసుల్లో ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను యూజ్ చేస్తుంటారు. వాటిని వాస్తుప్రకారం సరైన దిశలో ఉంచకపోవడం కెరీర్ వృద్ధిపై ప్రభావం చూపుతుందంటున్నారు. వాస్తుప్రకారం చూస్తే.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిదట. అదేవిధంగా ఆ పరికరాల వైర్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండకుండా, టేబుల్ టాప్లో కనిపించకుండా చూసుకోవాలంటున్నారు.
కూర్చునే విధానం : వాస్తుప్రకారం మనం కూర్చుని పనిచేసే విధానం కూడా కెరీర్ పురోగతిపై ప్రభావం చూపుతుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. మీకు ఆఫీసులో కుర్చీలో కాలుమీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోవాలంటున్నారు. ఎందుకంటే ఈ అలవాటు కెరీర్ ఎదుగుదల విషయంలో అడ్డంకిగా మారుతుందట. అలాగే కార్యాలయంలో ఎత్తైన కుర్చీలో కూర్చోవడం ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయని చెబుతున్నారు.
కూర్చునే దిశ :ఆఫీసులో కూర్చునే విధానం మాత్రమే కాదు.. కూర్చునే దిశ కూడా సరైనదిగా ఉండాలంటున్నారు. వాస్తుప్రకారం ఎప్పుడూ ఉత్తర దిశలో కూర్చుని పని చేయడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా పని చేసేటప్పుడు మీ వెనుక భాగంలో దృఢమైన గోడ ఉండేలా చూసుకోవాలంటున్నారు. దీనితో పాటు మీరు పని చోట వెనుక భాగంలో విండో ఉండకూడదట. వెనుక కిటికీ ఉంటే మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుందట.