ETV Bharat / spiritual

కార్తిక మాసంలో 'చాతుర్మాస వ్రతం' చేస్తే చాలు - వైకుంఠ ప్రాప్తి ఖాయం!

సకల పాపహరణం - కార్తిక పురాణ శ్రవణం - పద్దెనిమిదో అధ్యాయం కథ మీ కోసం!

Karthika Purana - Chapter 18
Karthika Purana - Chapter 18 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Karthika Puranam Chapter 18 : కార్తిక మాసం సందర్భంగా - ధనలోభుడు, అంగీరస మహామునుల సంవాదమును గురించి ఇంకను వివరిస్తూ వశిష్ఠుడు జనకునితో పద్దెనిమిదో రోజు కథలో వివరించిన అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

అంగీరస ధనలోభుల సంవాదం
అంగీరస మహాముని ఆత్మ, శరీరం గురించి చేసిన తత్వోపదేశం విన్న తరువాత ధనలోభుడు "ఓ మునివర్యా! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా సందేహములను తీరునట్లు మీరు జ్ఞానోపదేశం చేశారు. నేటి నుంచి నేను మీకు శిష్యుడను అయ్యాను. నా పూర్వ పుణ్యఫలము చేత నాకు మీ సాంగత్యము కలిగింది. అందుకే ఎక్కడో అరణ్యాలలో చెట్టునై పడి ఉన్న నేను ఈ రోజు మీ కృపతో ముక్తిని పొందాను. లేకుంటే పాపాత్ముడైన నేను కార్తిక మాసంలో ఈ పరమ పవిత్రమైన దేవాలయములోనికి ప్రవేశించగలిగే వాడిని కాదు. నన్ను తమరు తప్పక శిష్యునిగా స్వీకరించవలెను. అంతేకాక మానవుడు ఎటువంటి మంచి పనులు చేయవలెనో, దాని ఫలం ఎట్టిదో వివరించవలెను" అని ప్రార్థించెను.

అంగీరసుడు వివరించిన సత్కర్మలు
అంతట అంగీరసుడు "ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగమైనవి కాబట్టి వాటికి సమాధానాలు చెబుతాను వినుము" అని చెప్పసాగెను. మానవుడు ఈ శరీరమే సత్యమని నమ్మి అశాంతికి లోనగుచున్నాడు. సుఖదుఃఖాలు శరీరానికే గాని ఆత్మకు ఉండవు. కనుక అసలు మానవుడు తాను ఏ జాతికి చెందినవాడో, ఎటువంటి కర్మలు చేయవలెనో తెలుసుకుని వాటిని ఆచరించవలసి ఉంటుంది.

బ్రాహ్మణులు ఆచరించాల్సిన సత్కర్మలు
బ్రాహ్మణుడు అరుణోదయమున స్నానము చేయక ఎటువంటి సత్కర్మలు ఆచరించినను అవి వ్యర్థం. కార్తిక మాసంలో సూర్యుడు తులా రాశిలో, వైశాఖ మాసంలో సూర్యుడు మేష రాశిలో, మాఘ మాసంలో సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు - ప్రాతః కాలమునందు నదీ స్నానం చేసి, దేవతార్చన చేసినచో తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును" అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోభుడు "ఓ మహానుభావా! చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి? ఆ వ్రత విధానమెట్టిది? దాని ఫలితమేమి? నాకు వివరంగా చెప్పమని కోరుతున్నాను" అని అడుగగా, అందుకు అంగీకరించిన అంగీరసుడు ఇట్లు చెప్పసాగెను.

చాతుర్మాస వ్రతం మహత్యం
"ఓ ధనలోభా! వినుము. చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేష పాన్పుపై శయనిస్తాడు. దీనినే 'తొలి ఏకాదశి' అని 'శయన ఏకాదశి' అని అంటారు. అక్కడ నుంచి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉన్న విష్ణువు కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేలుకుంటాడు. ఈ నాలుగు నెలల కాలంలో శ్రీహరి ప్రీతి కోసం చేసే వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేరు. ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కోసం స్నాన, దాన, జపతపాలు ఏవి చేసినను పూర్ణ ఫలము కలుగుతుంది. ఈ విషయములు ఆ శ్రీహరి నాకు స్వయముగా చెప్పాడు కావున నేను నీకు చెబుతున్నాను. నీకు ఇది అర్థం కావడానికి ఒక కథ చెబుతాను వినుము" అంటూ చెప్పసాగెను.

నారాయణుని దర్శించిన నారదుడు
కృతయుగములో శ్రీ వైకుంఠం నందు లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మహావిష్ణువు సకల దేవతల చేత పూజలందుకుంటున్న సమయంలో నారద మహర్షి అక్కడకు వచ్చి కోటి సూర్య ప్రకాశముతో వెలిగిపోతున్న ఆ శ్రీహరికి నమస్కరించి నిలబడెను. అప్పుడు నారాయణుడు మందహాసముతో "ఓ నారదా! నీవు క్షేమమే కదా! త్రిలోకసంచారివైన నీకు తెలియని విషయాలు ఉండవు కదా! మహామునుల యజ్ఞయాగాదులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుచున్నాయి కదా! మానవులందరు వారికి నిర్దేశించిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నారు కదా!" అని కుశల ప్రశ్నలు అడిగెను.

శ్రీహరికి భూలోకంలోని పరిస్థితిని వివరించిన నారదుడు
నారదుడు విష్ణుమూర్తికి, ఆదిలక్ష్మికి నమస్కరించి "ఓ దేవా! ఈ జగమున మీకు తెలియని విషయాలు ఉండునా? అయినా అడిగావు కాబట్టి చెప్పుచున్నాను. భూలోకంలో కొందరు మునులు, మానవులు వారి వారి స్వధర్మములు పాటించకుండా తిరుగుతున్నారు. కొందరు నిషిద్ధమైన ఆహారాన్ని తింటున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా ఉంటే మరికొందరు వారిని నిందిస్తూ పాపాత్ములుగా తిరుగుతున్నారు. వారు ఏ విధముగా ముక్తిని పొందుతారో తెలియజేయమని" నారదుడు శ్రీహరిని ప్రార్థించాడు.

భూలోకానికేగిన శ్రీమన్నారాయణుడు
నారదుని మాటలు విన్న ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో కలిసి వేలకొలది మునులున్న భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో తిరుగసాగెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా నరుల మధ్య తిరుగుతున్న భగవంతుడైన శ్రీహరిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేశారు. మరికొందరు గర్విష్టులై భగవంతుని గుర్తించలేక అపహాస్యము చేస్తూ పరనిందలతో తిరుగుచుండిరి.

నైమిశారణ్యమునకు తరలిపోయిన శ్రీహరి
అప్పుడు అపారమైన దయతో ఆ శ్రీహరి ఆ మానవులను ఉద్ధరింపదలచి ముసలి బ్రాహ్మణుని రూపం విడిచి పెట్టి శంఖుచక్ర గదాధారియై, లక్ష్మీదేవితోను, సమస్త పరివారముతో, మునులకు ప్రీతికరమైన నైమిశారణ్యమునకు తరలిపోయెను. అప్పుడు ఆ వనమునందు తపస్సు చేసుకొంటున్న మునులు తమ ఆశ్రమమునకు తరలి వచ్చిన ఆ శ్రీమన్నారాయణునికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి, ఆ శ్రీహరిని పలు విధములుగా స్తుతించారు" అని అంగీరసుడు ధనలోభునికి చెబుతూ అక్కడకు ఆపాడు. ఈ విధముగా అంగీరస, ధన లోభుల సంవాదమును జనకమహారాజుకు చెబుతూ పద్దెనిమిదో రోజు కథను వశిష్ఠుల వారు ముగించారు.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యే అష్టాదశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.