Vastu Tips For Home :ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండకూడదంటే.. ఆ ఇంటిపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉండాలి. అందుకే మెజార్టీ జనాలు ఎప్పుడూ ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. కానీ.. ఇంటి మేడపైన మాత్రం పాత వస్తువులు, విరిగిన కుర్చీలు వంటివి పెడుతుంటారు. అయితే.. వాస్తు ప్రకారం మేడపై కొన్ని వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని వాస్తు పండితులంటున్నారు. దీనివల్ల వారి ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి.. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న విధంగానే టెర్రస్‌ను కూడా క్లీన్‌గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మరి వాస్తు ప్రకారం ఇంటిమేడపై పెట్టకూడని వస్తువులు ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
ఇంటిమేడపై వాస్తు ప్రకారం ఉండకూడని వస్తువులు :
వెదురు కర్రలు :
చాలా మంది ఇంటిని నిర్మించేటప్పుడు, అలాగే రిపేర్ చేయించేటప్పుడు వెదురు కర్రలను ఉపయోగిస్తుంటారు. ఇంటిపని మొత్తం పూర్తయిన తర్వాత వాటిని కింద పెట్టడం ఎందుకని, మేడపైన పెడుతుంటారు. అయితే.. వాస్తు ప్రకారం ఇంటి మేడపైన వెదురు కర్రలు ఉండకూడదట. వీటివల్ల ఇంట్లో గొడవలు జరిగి కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతత దూరమవుతుందని తెలియజేస్తున్నారు.
విరిగిన ఫర్నిచర్ :
వాస్తు నియమాల ప్రకారం.. మేడపైన విరిగిన కుర్చీలు, టేబుళ్ల వంటివి ఉండకూడదట. వీటివల్ల ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.
పగిలిన కుండలు :
మేడపైన ఎప్పుడూ పగిలిన కుండలను పెట్టకూడదట. కొంత మంది ఈ పగిలిన కుండలలో వివిధ రకాల పూల మొక్కలను కూడా పెంచుతుంటారు. అయితే, ఇలా అస్సలు చేయకూడదని పండితులంటున్నారు. టెర్రస్‌పైన పగిలిన కుండలు ఉండటం వల్ల ఇంట్లో అశాంతులు కలుగుతాయని చెబుతున్నారు.
చీపురుకట్ట :
ఇంటిమేడపై చీపురుకట్ట ఉండకూడదు. దీనిని ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి, మేడపైన క్లీన్ చేసిన తర్వాత దానిని కింద పెట్టండి.