Vastu Rules for House Constructs Near Graveyard :హిందూ సంప్రదాయంలో చాలా మంది వాస్తును బలంగా నమ్ముతారు. ఏ చిన్న నిర్మాణం, పని చేపట్టినా.. వాస్తు నియమాలను పాటిస్తుంటారు. ఇక కొత్తగా ఇల్లు నిర్మించాలనుకుంటే మాత్రం.. ప్లేస్, పునాది దగ్గర నుంచి నిర్మాణం పూర్తయ్యాక వేసే రంగుల వరకు ప్రతి విషయంలోనూ వాస్తును ఫాలో అవుతుంటారు కొందరు. అయితే.. పట్టణాలు, నగరాల్లో కొందరు శ్మశానాలకు దగ్గరగా ఇల్లు నిర్మించుకోవాల్సి వస్తుంది. మరి, వాస్తుప్రకారం అక్కడ ఇల్లు(House)నిర్మించుకోవచ్చా? అనే సందేహం వస్తుంది. దీనిపై వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా? - వాస్తు ఏం చెబుతోంది! - What to Do Dead Person Belongings
వాస్తుప్రకారం.. శ్మశానానికి దగ్గర ఉండే ప్రాంతాలలో నివసించడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ నెగెటివ్ ఎనర్జీ వివిధ సమస్యలను కలిగించవచ్చంటున్నారు. అంతేకాదు.. అక్కడ శవాలను కాల్చేటప్పుడు ఆ వాతావరణం పొల్యూషన్ అవుతుంది. ఫలితంగా మీరు ఆ గాలిని పీల్చుకోవడం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు. అలాగే అక్కడ జరిగే కర్మకాండలను చూస్తే పిల్లలు ఆందోళనకు గురికావచ్చు.
వాస్తు : ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నట్టయితే - కష్టాలను పిలిచినట్టే!
అదేవిధంగా.. ఇంట్లోని మహిళలు తమ పనులను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు. నిత్యం భయంతో లోలోపల మనోవేదనకు గురవుతారంటున్నారు వాస్తు పండితులు. అలాగే.. నిత్యం చితి మంటలు కాలుతుంటే.. వాటిని చూస్తూ చావు గురించిన ఆందోళన పెరిగి మానసిక ప్రశాంతత దూరం కావొచ్చని అంటున్నారు. చనిపోయిన వారి బంధవుల ఆక్రందనలు నిత్యం ఉండే చోట మీ ఇల్లు ఉంటే.. అది ఆనంద నిలయంగా ఉండకపోవచ్చని.. అందుకు విరుద్ధమైన పరిస్థితులను సృష్టిస్తుందని అంటున్నారు. ఇల్లు అంటే.. కేవలం నీడ కోసం మాత్రమే కాకుండా జీవన వైభవం కోసం, కుటుంబ వికాసం కోసం అనే విషయాలను గుర్తు పెట్టుకొవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వాస్తు : ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నట్టయితే - కష్టాలను పిలిచినట్టే! - Avoid These Plants As Per Vastu