తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

టీటీడీ గుడ్ న్యూస్ - ఉచితంగా కారు సాకర్యంతో స్వామి దర్శనం- వారికి మాత్రమే! - Free Darshan for Senior Citizens - FREE DARSHAN FOR SENIOR CITIZENS

Tirumala Tirupati Devasthanam: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. కారు సౌకర్యంతో ఉచితంగా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. మరి మీరు కూడా తిరుమల వెళ్లాలనుకుంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

TTD Free Darshan for Senior Citizens
FREE DARSHAN FOR PHYSICALLY DISABLED AND SENIOR CITIZENS (ETVBharat)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 6:48 PM IST

TTD Free Darshan for Senior Citizens: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమల కొండకు తరలి వెళ్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆ ఏడుకొండలవాడిని కనులారా చూసి మొక్కులు చెల్లిస్తారు. ఇదిలా ఉంటే స్వామి వారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌‌‌కు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌ విషయంలో‌‌ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎటువంటి టెన్షన్​ లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం వారి కోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్​ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది.

ఆలయం బయట గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు. అలాగే దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను పొందొచ్చని.. అదనపు లడ్డూల కోసం ఒక్కో దానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది.

శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమలలో పలు సేవలు రద్దు - టీటీడీ కీలక నిర్ణయం! - TTD Cancelled VIP Break Darshan

ఎవరు అర్హులు:

  • వృద్ధులకు వయసు 65 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • దివ్యాంగులు, ఓపెన్ హార్ట్​ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
  • ఒకవేళ వృద్ధులు వాళ్లకై వాళ్లే నిలుచోలేని పక్షంలో ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని.. అటెండర్‌గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుంది.

దర్శన సమయంలో కావాల్సిన పత్రాలు:

  • ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు తప్పనిసరి.
  • దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతో పాటు.. ఫిజికల్ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో రావాలి.
  • వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్న వారు సంబంధిత సర్జన్ / స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలి.

స్లాట్ ఇలా బుక్ చేసుకోవాలి:వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనం స్లాట్ కోసం టికెట్‌ను ఆన్​లైన్​లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్​సైట్​ ద్వారా బుక్​ చేసుకోవాలి. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు.

  • ముందుగా టీటీడీ వెబ్​సైట్​ Tirumala Tirupati Devasthanam(Official Booking Portal)ఓపెన్​ చేయాలి.
  • హోమ్​పేజీలో Online Services​ ఆప్షన్​పై క్లిక్​ చేసి Differently Abled/Sr.Citizen Darshan ఆప్షన్​పై క్లిక్​ చేసుకోవాలి.
  • తర్వాత మొబైల్​ నెంబర్​, ఓటీపీ సాయంతో లాగిన్​ అవ్వాలి.
  • ఇప్పుడు Category ఆప్షన్​లో Senior Citizen/Medical Cases/Differently Abled ఈ మూడింటిలో ఒక ఆప్షన్​ను సెలక్ట్​ చేసుకోవాలి.
  • తర్వాత మీరు ఏ రోజు స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని సెలక్ట్​ చేసుకోవాలి.
  • తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్​ బుక్​ చేసుకోవాలి.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

హైదరాబాద్​ To తిరుపతి - ఒక్కరోజులో శ్రీనివాసుడి దర్శనం! టికెట్​ ధర ఎంతంటే! - Telangana Tourism Tirupati tour

ABOUT THE AUTHOR

...view details