తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా? - వాస్తు ప్రకారం మీకు ఆర్థిక కష్టాలు గ్యారెంటీ! - Purse Vastu Tips

Purse Vastu Tips : చాలా మంది పర్సు వాడుతుంటారు. కేవలం డబ్బులే కాకుండా.. ఏవేవో వస్తువులు అందులో దాస్తుంటారు. అయితే.. వాస్తుప్రకారం పర్సులో కొన్ని వస్తువులు ఉంచకూడదట. ఆ వస్తువులు మీకు ఆర్థిక కష్టాలు తెస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Purse
Purse Vastu Tips

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 1:06 PM IST

Vastu Tips for Purse :కొంతమంది తమ పూర్వీకుల ఫొటోలను వాలెట్​లో ఉంచుకుంటారు. కానీ, వాస్తుశాస్త్రం(Vastu) ప్రకారం పర్సులో పూర్వీకుల చిత్రాలను పర్సులో ఉంచుకోవడం శుభప్రదమైనది కాదట. ఎందుకంటే పర్సులో మనం డబ్బు పెట్టుకుంటాం. అంటే లక్ష్మీదేవి నివాసం. అలాంటి ప్లేస్​లో చనిపోయిన వారి ఫొటోలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి మన నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందట. ఈ కారణంగా మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే ఛాన్స్ ఉందని వాస్తుపండితులు చెబుతున్నారు.

చిరిగిన నోట్లు : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఏదైనా కరెన్సీ నోటు చిరిగితే.. తీసేయకుండా అలాగే పర్సులోనే ఉంచుతుంటారు. అయితే వాస్తుప్రకారం ఎప్పుడూ చిరిగిపోయిన కరెన్సీ నోటును ఉంచవద్దు. ఇలా ఉంచడం లక్ష్మీదేవి కోపానికి గురై విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు వాస్తు నిపుణులు. అలాగే ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని చెబుతున్నారు.

రుణ బాధలు తొలగాలా? ఈ వాస్తు నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు!

తాళం చెవి పెటొద్దు :చాలా మంది పర్సులో ఇంటి తాళం చెవి పెడుతుంటారు. కానీ.. వాస్తు ప్రకారం వాలెట్​​లో కీ తోపాటుగా.. లోహంతో తయారు చేసిన ఇతర వస్తువులను కూడా ఉంచడం మంచిది కాదట. అలా ఉంచడం ద్వారా డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుందని వాస్తునిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీకు ఆ అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండని చెబుతున్నారు.

చిరిగిన పర్సు :కొందరు పర్సు చిరిగి పోయినప్పటికీ దానినే యూజ్ చేస్తుంటారు. అయితే, వాస్తుప్రకారం.. చిరిగిన పర్సును వాడడం మంచిది కాదు. ఒకవేళ మీరు చిరిగిన వాలెట్​ను ఉపయోగిస్తే అది జీవితంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి దారితీయవచ్చంటున్నారు వాస్తునిపుణులు. అలాగే, పర్సులో ఎలాంటి లోన్, బిల్లు పేపర్లు, వడ్డీ చెల్లించే పత్రాలను ఎప్పుడూ ఉంచుకోవద్దంటున్నారు వాస్తుపండితులు. ఇలా చేయడం వల్ల చాలా డబ్బు నష్టం వస్తుందని చెబుతున్నారు.

దేవుడి ఫొటో : చాలా మంది పర్సులో తమకు ఇష్టమైన దేవుడి ఫొటో పెట్టుకుంటారు. కానీ.. వాస్తుప్రకారం పర్సులో దేవుడి బొమ్మను ఎప్పుడూ ఉంచవద్దు. అలా ఉంచడం వల్ల అప్పుల భారం పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దేవుడి ఫొటో ఉండకూడదనే దానికి మరో కారణం ఉంది. మనం ఎక్కడపడితే అక్కడ తిరిగి, అశుభ్రమైన చేతులతో పర్సును తాకుతుంటాం. ఇలా చేయడం వల్ల దేవతలను అపవిత్రం చేసిన వారిమవుతామని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అలాగే పర్సులో వాస్తుప్రకారం నలుపు రంగు వస్తువులను ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే నలుపు రంగు డబ్బు నష్టానికి సంకేతం. కాబట్టి ఆ కలర్ వస్తువులను పర్సులో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తుప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే - అదృష్టం మీ వెంట ఉన్నట్లే!

ABOUT THE AUTHOR

...view details