Telangana Tourism Temple Tour Package :వేసవి కాలం వచ్చేసింది. ఇక పిల్లలకూ సమ్మర్ హాలిడేస్ వచ్చేశాయి. ఇవాళే లాస్ట్ వర్కింగ్ డే. ఈ క్రమంలో చాలా మంది పిల్లలతో కలిసి టూర్ వెళ్లి రావాలని అనుకుంటారు. ఇలాంటి వారికోసం తెలంగాణ టూరిజం(Telangana Tourism)శాఖ.. సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. చాలా తక్కువ ధరతోనే ఉత్తర తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను ఒక్కరోజులోనే దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంతకీ.. ఈ టూర్ ప్యాకేజీ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది? ధర ఎంత? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణ టూరిజం శాఖ.. 'టెంపుల్ టూర్'(Temple Tour) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఉత్తర తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలను కవర్ చేసే ఈ 'వన్ డే టూర్'.. రోడ్డు మార్గం ద్వారా కొనసాగనుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ శని, ఆదివారాల్లో పర్యాటకులకు అందుబాటులో ఉంటుందని తెలంగాణ టూరిజం డిపార్ట్ మెంట్ తెలిపింది. దీనిని హైదరాబాద్ నగరం నుంచి ఆపరేట్ చేస్తున్నారు.
టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరల వివరాలు :
ఈ టెంపుల్ టూర్(Sathavahana Region) ప్యాకేజీలో భాగంగా.. ఉత్తర తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు. ధర విషయానికొస్తే.. టికెట్ ధరలు పెద్దలకు రూ. 1999, పిల్లలకు రూ. 1,599గా నిర్ణయించారు. ఈ పర్యటన నాన్ ఏసీ కోచ్ బస్సులో కొనసాగనుంది.
టూర్‌కు వెళ్తున్నారా? ఈ స్నాక్స్ మస్ట్ అంటున్న నిపుణులు!
పర్యటన కొనసాగనుందిలా..
- ఈ "వన్ డే" టూర్ హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది.
- టూర్లో భాగంగా 08.30 AM నుంచి 09.00 AM మధ్య హరిత హోటల్ లో టీ, బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది.
- అనంతరం ఉదయం 9 గంటలకు వేములవాడకు బయల్దేరుతారు.
- మార్నింగ్ 10.30 నుంచి 11గంటల 30 నిమిషాల మధ్యలో వేములవాడ రాజన్న(Vemulawada) ఆలయాన్ని దర్శించుకుంటారు.
- ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కొండగట్టు ఆలయానికి రీచ్ అవుతారు. అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని హారిత హోటల్లో భోజనం చేస్తారు.
- లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ధర్మపురికి బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ధర్మపురి ఆలయాన్ని దర్శించుకుంటారు.
- అనంతరం టీ బ్రేక్ ఉంటుంది. అది ముగిశాక సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రిటర్న్ అవుతారు. రాత్రి 10 గంటలకు నగరానికి చేరుకోవడంతో వన్ డే టూర్ ప్యాకేజీ ముగుస్తుందని తెలంగాణ టూరిజం తెలిపింది.
- ఈ ప్యాకేజీని https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చని తెలంగాణ టూరిజం పేర్కొంది.
- ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే +91-1800-425-46464 నంబర్‌ను సంప్రందించవచ్చు.
IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా!