తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

హైదరాబాద్​ To తిరుపతి - ఒక్కరోజులో శ్రీనివాసుడి దర్శనం! టికెట్​ ధర ఎంతంటే! - Telangana Tourism Tirupati tour - TELANGANA TOURISM TIRUPATI TOUR

Tirupati Tour: ఒక్కరోజులోనే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. తెలంగాణ టూరిజం తిరుపతి వన్ డే టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలు కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Telangana Tourism
Telangana Tourism

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 12:38 PM IST

Telangana Tourism Operating One Day Tour Package for Tirupati:కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామి వారి సన్నిధిలో అడుగు పెట్టి, కళ్లతో స్వామి వారి దివ్యరూపాన్ని చూసి తరించాలని ఎంతో మంది ఆశపడతారు. వేల మంది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం గుడ్​న్యూస్​ చెప్పింది. కేవలం ఒక్కరోజులోనే తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఓ స్పెషల్​ ఆఫర్​ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ టూరిజం (Telangana Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్ డే తిరుపతి టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారిని హైదరాబాద్​ నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్లి తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. అంతే కాదు.. ఈ టూర్ ప్యాకేజీలో తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా కవర్ అవుతుంది. మరి వన్​ డే టూర్​ ఎలా ఉండనుందంటే..

  • తెలంగాణ టూరిజం తిరుపతి టూర్ ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది.
  • ఉదయం 6.55 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • అక్కడి నుంచి తిరుపతిలోని హోటల్‌కు కారులో తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత తిరుమలకు కారులో బయల్దేరాలి.
  • రెండు గంటల్లో అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఆ తర్వాత తిరుపతి చేరుకోవాలి.
  • ఓ గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి.
  • ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరాలి.
  • సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంటలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

తెలంగాణ టూరిజం తిరుపతి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి 12వేల 499 రూపాయలు.. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, కారులో లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ ఆలయంలో దర్శనం కవర్ అవుతాయి. అంతే కాకుండా ఒక్కొక్కరికి 15వేల 499 రూపాయలతో రెండు రోజుల టూర్​ను కూడా తెలంగాణ టూరిజం అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో https://tourism.telangana.gov.in/తెలుసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details