Ram Navami 2024 Dos and Donts : ఏటా చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమిని(Ram Navami 2024) జరుపుకుంటారు. ఆ ఘడియలు ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 బుధవారం నాడు వచ్చాయి. ఈ వేడుకకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు శ్రీరామనవమి వేడుకలను వైభంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ పవిత్రమైన రోజు చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఉపవాసం ఉండే వారు తప్పక కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చేయవలసినవి :
- శ్రీరామనవమి రోజున ప్రతిఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానమాచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించాలి. కొత్త బట్టలు ధరించాలి.
- ఆ తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడు విగ్రహాలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ పూజలో శ్రీ సీతారాముడిని అష్టోత్తర శతనామావళితో అర్చించాలి.
- రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి.
- ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తికలుగుతుందని భక్తులు నమ్ముతారు.
- శ్రీరామనవమి రోజున రామనామస్మరణం చేయడం, రామకోటి వంటివి రాయడంవల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
- శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండే వారు ఆహారపు నియమాల గురించి తెలుసుకొని వాటిని పాటించినప్పుడే పుణ్య ఫలాలు దక్కుతాయని పండితులు సూచిస్తున్నారు.
- ఈ రోజు ఉపవాసం ఉండే వారు రోజంతా హైడ్రేట్‌గా ఉండడానికి తగినంత వాటర్, కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి కొన్ని పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు.
- అలాగే, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అంటే కొన్ని తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, పాల ఉత్పత్తులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.