Signs of Shani Dosha : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాల మార్పులు మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతారు. అందులో ముఖ్యంగా నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతారు. శని ప్రభావం ఎంతలా ఉంటుందంటే ఆయన చూపు పడితే చాలు.. ఎంతటి ధనవంతుడైనా నిరుపేద కాగలడు, నిరుపేద.. ఐశ్వర్యవంతుడు కాగలడట. అందుకే.. చాలా మందికి శని పేరు చెప్పగానే భక్తి కంటే భయమే ఎక్కువ కలుగుతుంది. శని దోష ప్రభావం ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఆ దోషం నుంచి ఎలా బయటపడాలి? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎవరి మీదైతే శని దోష ప్రభావం ఉంటుందో.. వారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శని దోష ప్రభావం ఉన్న వ్యక్తులు జూదం, మద్యపానం, ధూమపానం, ఇతర చెడు అలవాట్లకు బానిసలవుతారట. అంతేకాకుండా.. అప్పుల భారం, పనిలో ఇబ్బందులు, ఇల్లు అమ్మకం లేదా మరేదైనా నష్టం వంటి సమస్యలు మీ నిత్య జీవితంలో ఎదురవుతుంటే.. శనీశ్వరుడు మీపై కోపంగా ఉన్నాడని తెలుసుకోవాలని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇవేకాకుండా.. మీపై శని దోష ప్రభావం ఉంటే ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు తలెత్తుతాయంటున్నారు.
తల వెంట్రుకలు రాలడం, కళ్లు, చెవులకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట. అదేవిధంగా కడపునొప్పి, క్యాన్సర్, పక్షవాతం, శారీరక అలసట, స్కిన్ ప్రాబ్లమ్స్, జలుబు వంటి అనేక రకాల జబ్బులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్న వారు శనిదేవుడి అనుగ్రహం పొందితే.. ఆరోగ్యంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటారని చెబుతున్నారు. ఇంతకీ శనిదేవుడిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం.