Shani Retrograde From The 29th June 2024 :మానవుడు చేసే మంచి పనులకైనా, చెడు పనులకైనా ఫలితాన్ని ఇచ్చేది శని భగవానుడే! సాధారణంగా పురోగమన దిశలో ఉండే శని భగవానుడు ఈసారి తిరోగమనంలోకి వెళ్లనున్నారు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శనీశ్వరుడు జూన్ 29వ తేదీ నుంచి దాదాపు నాలుగైదు నెలల పాటు అంటే నవంబర్ 15వ తేదీ వరకు తిరోగమన దిశలో కదలనున్నాడు. శనీశ్వరుని ఈ తిరోగమనం ఎవరికి లభిస్తుంది? ఎవరికి నష్టం కలిగిస్తుందో చూద్దాం.
శనీశ్వరుని తిరోగమనం మంచిదేనా!
సాధారణంగా శనిగమనం కొన్ని రాశులకు మేలు చేస్తే, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం శనీశ్వరుని తిరోగమనం శుభకరం కాదు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం శని తిరోగమనం వలన గొప్ప అదృష్ట యోగం పట్టనుంది. ముఖ్యంగా మూడు రాశులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆ మూడు రాశులు ఏమిటో చూద్దాం.
కన్యా రాశి
శని తిరోగమనం ప్రధానంగా కన్యారాశి వారికి బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఈ నాలుగు నెలల కాలం అత్యంత శుభకరంగా ఉంటుంది. వాస్తవానికి కన్యారాశి వారికి ఈ నాలుగైదు నెలల కాలంలో ప్రతికూల గ్రహాలు బలహీనపడటం వలన, చేసే ప్రతి పనిలోనూ సానుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల వారు మంచి లాభాలను గడిస్తారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. డబ్బు బాగా సంపాదిస్తారు. ఆర్ధికంగా స్థిరపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పరిపూర్ణ దైవానుగ్రహం కోసం ప్రార్ధించండి.
తులారాశి
శని తిరోగమనం వలన లాభాలను పొందే మరో రాశి తులారాశి. జూన్ 29 నుంచి తులారాశి వారి దశ తిరగనుంది. తులారాశి జాతకులకు ఏవో కారణాల వలన చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు సానుకూలంగా పూర్తవుతాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆర్ధికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారులకు శుభతరుణం. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి, ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికీ నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. దైవ బలం మీద విశ్వాసంతో ఉండండి.