Remedies for Kaal Sarp Dosh:జాతకంలో దోషాలు ఉండడం సాధారణమే. మన జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే దాని ప్రభావం మనపై కచ్చితంగా ఉంటుంది. అయితే, దోషాలలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కాలసర్ప దోషం కూడా ఒకటి. జ్యోతిష్యం ప్రకారం ఇది అత్యంత ప్రభావవంతమైన దోషం. ఈ దోషాన్ని పోగొట్టుకోవాలనుకునే వారు కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కాలసర్ప దోషాలు ఉంటే ఏం జరుగుతుంది?:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 144 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. అందులో 12 ముఖ్యమైనవని అంటున్నారు. 100 మందిలో సుమారు 80 మంది జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటుందని వివరిస్తున్నారు. ఈ దోషం ఉంటే ఏం చేసినా అదృష్టం కలిసి రాదని, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, చేస్తున్న పనుల్లో ఆటంకాలు వంటివి ఎదురవుతాయని అంటున్నారు. అయితే ఏ రకమైనటువంటి కాలసర్ప దోషాలు ఉన్నా వాటిని సంపూర్ణంగా పోగొట్టేందుకు జన్మ లేదా నామ రాశిని బట్టి కొన్ని పరిహారాలు పాటించాలని చెబుతున్నారు.
కాలసర్ప దోషాలు ఉంటే ద్వాదశ రాశుల వారు చేయాల్సిన పరిహారాలు:
మేష రాశి: ఈ రాశి ఉన్న వారికి కాలసర్ప దోషాలు ఉంటే ఆవ నూనెతో చేసిన పదార్థాలను వీలైనప్పుడు కుక్కలకు ఆహారంగా వేస్తుండాలని చెబుతున్నారు. అలాగే పక్షులకు గింజలు కూడా వేస్తుండాలని సూచిస్తున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారు జపమాలికలలో ఉండే చందనపు మాలికను మెడలో ధరించడం వల్ల కాలసర్ప దోషం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఆవనూనెతో తయారైన పదార్థాలను ఎవరికైనా పంచిపెడితే మంచి జరుగుతుందని చెబుతున్నారు.
మిథున రాశి: ఈ రాశి కలిగిన వారు పక్షులకు గింజలు ఆహారంగా వేయాలని చెబుతున్నారు. అలాగే గణపతిని గరికతో పూజించడం వల్ల కూడా ఈ దోషం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు దుప్పట్లను మీ చేతుల మీదుగా దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అలాగే పుట్టలో పాలు పోయడం వల్ల కూడా ఈ దోషాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.
సింహ రాశి: ఈ రాశిలో పుట్టిన వారికి కాలసర్ప దోషం తొలగిపోవాలంటే కుక్కలకు మినప గారెలు ఆహారంగా పెట్టాలని చెబుతున్నారు. అలాగే వీలైనప్పుడుల్లా శని లేదా ఆదివారం నాడు సూర్యనమస్కారం చేసి నీళ్లలో పాలు కలిపి వాటిని రావి చెట్టుకు పోస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.
కన్య రాశి: కాలసర్ప దోషాలు తొలగించుకునేందుకు ఈ రాశిలో పుట్టిన వారు దర్భ మాలిక ధరించాలని సూచిస్తున్నారు. అదే విధంగా కుక్కలకు తీపి పదార్థాలను ఆహారంగా వేసినా మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.