Reading Hanuman Chalisa On Saturday : రాముడు- హనుమంతునికి అవినాభావ సంబంధం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు గొప్ప రామ భక్తుడు. ఆంజనేయుని కంటే గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవరూ లేరని అంటారు. శ్రీరాముని అనుగ్రహం కావాలనుకునే వారు ఆంజనేయ స్వామిని కొలవాలంట! మరి ఆ హనుమయ్య మాత్రం శ్రీరామ అన్నవారికి దాసుడవుతాడంట! ఇదే శ్రీరాముడు, హనుమంతుడికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం. ఇక ఇద్దరినీ కలిపి పూజించే వారికి ఈ లోకంలో తిరుగే ఉండదు.
జై చిరంజీవ! జగదేక వీర!
పవన పుత్ర హనుమాన్ నేటికీ చిరంజీవిగా భూమిపై తిరుగుతున్నాడన్నది కాదనలేని సత్యం. ఎక్కడెక్కడ శ్రీరాముని కీర్తనలు, కథలు, భజనలు జరుగుతాయో అక్కడక్కడ హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడంట! అలాంటి చిరంజీవి అయిన హనుమంతుని ఆరాధిస్తే ఇంట్లో సుఖం, శాంతి, ఐశ్వర్యం, ధైర్యం, విజయం, అభయం, ఆయువు, ఆరోగ్యం ఇలా అన్నీ సమకూరుతాయి.
సానుకూల శక్తికి సంకేతం హనుమాన్ చాలీసా
'జై హనుమాన జ్ఞాన గుణసాగర' అంటూ మొదలయ్యే హనుమాన్ చాలీసా పఠించే వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగల మనో నిబ్బరం వస్తుంది. హనుమాన్ చాలీసా చదివే వారికి సానుకూల దృక్పధం ఎక్కువగా ఉంటుంది. గొప్ప మానసిక శాస్త్రవేత్తలు కూడా సానుకూల ఆలోచనలు ఉంటేనే జీవితంలో అభివృద్ధి చెందుతారు అని చెబుతారు కదా!
సమస్యలకు పరిష్కారం
హనుమాన్ చాలీసా చదివితే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
దుష్ట శక్తుల నుంచి విముక్తి
హనుమాన్ చాలీసా రోజుకు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు అంటారు.
రోగ వినాశం పీడ హరణం
హనుమాన్ చాలీసా పఠిస్తే రోగాలు నశించి పోతాయి, పీడలు హరించిపోతాయి.
సంకట మోచనం-కార్య సిద్ధి
హనుమాన్ చాలీసా పఠనం వలన సంకటాలు తొలగిపోయి, సకల కార్య సిద్ధి కలుగుతుంది.