Plants Not Good For Home As Per Vastu : చెట్లు మనకు పండ్లు, పూలను ఇవ్వడమే కాకుండా ఎప్పుడు పచ్చటి వాతావరణాన్ని, నాణ్యమైన గాలిని అందిస్తుంటాయి. ఇంట్లో, చుట్టూ మొక్కలను పెంచుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల గదిలో పాజిటివిటీ పెరుగుతుందని, ఆర్థికంగా కూడా అదృష్టం వరిస్తుందని వాస్తు నిపుణుులు చెబుతుంటారు. అవును నిజమే, కానీ కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టం జరిగే అవకాశాలున్నాయట. ఇంట్లో అస్సలు పెంచుకోకూడని కొన్ని మొక్కలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం.
బొన్సాయ్(Bonsai)
ఆకారంలో, అందంలో చాలా ముద్దుగా ఉంటుంది బొన్సాయ్ మొక్క. ఇది చూడటానికి కుంగిపోయిన్లుగా ఉంటుంది. అలాగే చాలా నెమ్మదిగా పెరుగుతుంది. దీన్ని ఉంచుకోవడం వల్ల సభ్యుల కెరీర్ కూడా కుంగిపోయినట్లుగా ఉంటుందని, పురోగతి నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పత్తి(Cotton)
పత్తి మొక్కలు, మొగ్గలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి కోతలు, గాట్లను కలిగిస్తాయి. పెద్ద పరిమాణం కారణంగా వీటిని ఇంట్లో పెంచుకుంటే శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుందని, ఇంట్లో అయోమయ వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.
కాక్టస్ (Cactus)
కాక్టస్ మొక్క ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంది. ఇంట్లోని సానుకూల ప్రవాహానికి అడ్డంకులు సృష్టిస్తుంది.అదనంగా సామర్థ్యానికి భంగం కలిగిస్తుంది. అందుకే చూడటానికి అందంగా ఉన్నప్పటికి ఇంటి లోపల కాక్టస్ మొక్కను పెంచుకోవద్దని సూచిస్తుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.
చింతచెట్టు(Tamarind)
చింతచెట్టు కూడా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు నమ్ముతారు. ఈ చెట్టు పెద్ద పరిమాణం శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందట. అలాగే చింతపండులోని పుల్లటి స్వభావం ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలను పాడు చేస్తుందని చెబుతున్నారు.