తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఇంట్లో గన్నేరు పూల మొక్కలను పెంచుకోవచ్చా? వాస్తు నిపుణులు సమాధానమిదే! - Oleander Flower At Home - OLEANDER FLOWER AT HOME

Can We Plant Oleander Flower At Home : ఇంట్లో రంగు రంగుల పూల మొక్కలుంటేనే.. ఆ ఇంటికి అందం. అందుకే చాలా మంది ఇంట్లో బంతి, చామంతి, గన్నేరు వంటి రకరకాల పూల మొక్కలను పెంచుతుంటారు. అయితే, వాస్తు ప్రకారం ఇంట్లో గన్నేరు పూల మొక్కలను పెంచుకోవచ్చా ? లేదా ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Oleander Flower At Home
Can We Plant Oleander Flower At Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 3:53 PM IST

Oleander Flower At Home :చాలా మంది ఇంట్లో వివిధ రకాల పూల మొక్కలను పెంచుతుంటారు. వీటిని పెంచడం వల్ల మానసిక ప్రశాంతత కలగడంతోపాటు, ఇంటి వాతావరణం అందంగా మారిపోతుంది. అయితే, చాలా మంది ఇంటి ఆవరణలో గన్నేరు పూల చెట్లు తప్పకుండా కనిపిస్తాయి! ఎరుపు, తెలుపు, పసుపు వంటి వివిధ రంగుల్లో ఉండే గన్నేరు పూలను ఇంట్లో పూజ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ చెట్టు ఉండొచ్చా ? ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రంలో గన్నేరు పూలకు అధిక ప్రాధాన్యత ఉంది. వీటితో పూజ చేయడం వల్ల ఇంట్లోని అశాంతులు తొలగిపోయి, సంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ దూరమైపోయి.. పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవికి గన్నేరు పూలంటే చాలా ఇష్టం. ఈ పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సిరిసంపదలకుఎలాంటి లోటు కలగదని వాస్తు నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఈ చెట్టును ఇంటి ఆవరణలో పెంచకుండా.. బయట పెంచి.. ఆ పూలను పూజకు ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి దోషం ఉండదంటున్నారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను కూడా ఇంట్లో పెంచకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బొన్సాయ్(Bonsai) :ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంట్లో బొన్సాయ్‌ మొక్కలను పెంచుకుంటున్నారు. అయితే, ఇవి చూడటానికి ఆకారంలో చిన్నగా, అందంగా ఉంటాయి. కానీ, వీటిని ఇంట్లో పెంచుకోవడం వల్ల కుటుంబ సభ్యులఎదుగుదలకుంగిపోయినట్లుగా ఉంటుందని, పురోగతి నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రావిచెట్టు ఆ దేవుడి ప్రతిరూపం - ఈ చెట్టుకు చేసే పూజను తీసిపారేయకండి!

పత్తి మొక్కలు (Cotton) :కొంతమంది ఇంట్లో పత్తి మొక్కలను పెంచుతుంటారు. అయితే, ఈ మొక్కల మొగ్గలు చాలా ప్రమాదకరమైనవి. వీటివల్ల శరీరంపై కోతలు, గాట్లు పడతాయి. పత్తి మొక్కలు పెంచడం వల్ల ఇంట్లో అయోమయ వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఈ మొక్కలను పెంచకూడదంటున్నారు.

కాక్టస్ (Cactus) :కాక్టస్ మొక్క ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని విడుదల చేస్తుందని.. అలాగే పాజిటివ్‌ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుందని అంటున్నారు. కాబట్టి, చూడటానికి అందంగా ఉండే ఈ మొక్కను ఇంటి లోపల పెంచుకోవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు .

చింతచెట్టు (Tamarind) :ఇంటి ఆవరణలో చింత చెట్టు పెంచుకోవడం వల్ల కూడా నెగటివ్‌ ఎనర్జీ వస్తుంది. ఈ చెట్టు పెద్దగా పెరిగి సానుకూల శక్తి రాకుండా అడ్డుకుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఈ మొక్కను నాటకండి!

Note :పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

అప్పుల బాధలు వేధిస్తున్నాయా? ఆ రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే సమస్య తీరిపోతుంది!

మీ పర్సులో ఇవి పెట్టుకుంటే చాలు - ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి.. ధనవంతులుగా మారుతారు!

ABOUT THE AUTHOR

...view details