తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈశాన్యంలో ఈ మూడు వస్తువులు ఉంచితే - అపార ధనలాభం కలుగుతుందట! - BEST THINGS TO PLACE IN NORTHEAST

-వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కుకు ఎంతో ప్రాముఖ్యత -ఈ వస్తువులు ఉంచితే శివయ్య, లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనే!

Best Things to Place in Northeast as Per Vastu
Best Things to Place in Northeast as Per Vastu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 4:33 PM IST

Best Things to Place in Northeast as Per Vastu :వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దిక్కుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను, ప్రాధాన్యతను అనుసరించే ఏ నిర్మాణాలైన పూర్తిచేసుకుంటారు. అయితే.. ఏ నిర్మాణానికైనా ఈశాన్యం చాలా పవిత్రమైన దిశ అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. దీన్ని ఈశాన్య కోణం లేదా ఈశాన్య మూల అని కూడా అంటారు. ఈ దిశతో ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం, ఆనందం, సంపద ముడిపడి ఉంటాయి. తూర్పు, ఉత్తరం కలిసే చోటు ఈశాన్యం అవుతుంది. అయితే ఈశాన్య దిక్కులో ఈ మూడు వస్తువులు ఉంచితే అపార ధనలాభం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కుకు ఎంతో విశిష్టత ఉందని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఎందుకంటే ఈశాన్యానికి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వురుడు అధిపతిగా ఉన్నారని అంటున్నారు. ఇంతటి పవిత్రమైన ఈశాన్య దిక్కులో రాగి చెంబు, దీపం, ఆవుదూడ బొమ్మ ఉంచడం వల్ల శివయ్య అనుగ్రహంతోపాటు లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభించి అపార ధనలాభం కలుగుతుందని అంటున్నారు. మరి వాటిని ఎలా ఏర్పాటు చేయాలంటే..

ఈశాన్యంలో రాగి చెంబును ఉంచడం :

  • ఈశాన్య దిక్కులో రాగిచెంబును గురువారం రోజు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి.. ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • అనంతరం ఆ పీట మీద బియ్యప్పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి.
  • ఆ తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన రాగి చెంబుకు పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు మీద ఉంచాలి.
  • అనంతరం ఆ రాగి చెంబులో నీళ్లు పోయాలి. ఆ నీళ్లలో పసుపు, కుంకుమ, అక్షింతలు, సువాసన కలిగిన పూలు, సుగంధ ద్రవ్యాలు(కస్తూరి, జవ్వాది), యాలకలు వేయాలి.
  • శుక్రవారం, శనివారం, ఆదివారం అలానే ఉంచి సోమవారం రోజు స్నానం చేసి ఆ నీటిని ఏదైనా మొక్కకు పోయాలి.
  • మళ్లీ గురువారం రోజున ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు.

ఈశాన్యంలో దీపాన్ని వెలిగించడం: ఈశాన్యంలో దీపం పెడితే చాలా మంచిదని.. ఈ దీపాన్ని ఈశాన దీపం అంటారని అంటున్నారు. ఈ దీపాన్ని గురువారం రోజు గురుహోరలో అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో దీపాన్ని వెలిగించాలని సూచిస్తున్నారు.

  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి.. ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • అనంతరం ఆ పీట మీద బియ్యప్పిండితో అష్టదళ పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద రెండు మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి ఉంచి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
  • అనంతరం ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి.

ఈశాన్యంలో ఆవుదూడ బొమ్మ ఉంచడం: సకల దేవతాస్వరూపమైన గోమాతతో దూడ కలిసి ఉన్న బొమ్మను ఈశాన్యంలో ఉంచితే మంచిదంటున్నారు.

  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి.. ఆ తర్వాత ఈశాన్య మూలలో ఓ పీట ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
  • అనంతరం ఆ పీట మీద బియ్యప్పిండితో అష్టదళ పద్మం లేదా ఏదైనా ముగ్గు వేయాలి. అనంతరం ఆ ముగ్గు మీద ఆవు దూడ బొమ్మ ఉంచాలి.
  • అలా ఉంచిన తర్వాత ప్రతిరోజూ పుష్పాలు, అక్షింతలతో పూజించడం, దీపం వెలిగించడం చేయాలంటున్నారు.
  • ఏదైనా కోరిక ఉంటే అది తీరేందుకు ఓ కాగితం మీద మీ కోరిక రాసి దానిని ఆవుదూడ బొమ్మ పాదాల వద్ద ఉంచి "ఓం సురభ్యే నమః" అనే మంత్రం చదువుతూ పువ్వులు, అక్షింతలతో 41 రోజుల పాటు పూజ చేయాలి.
  • 41 రోజుల తర్వాత ఆ చీటిని ఏదైనా వేపచెట్టు లేదా రావిచెట్టు వద్ద ఉంచి నమస్కారం చేసుకుని ఇంటికి వస్తే మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుందని అంటున్నారు.

NOTE :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

'మీ ఇంట్లో మల్లె చెట్టు ఈ దిక్కున.. కొబ్బరి చెట్టు ఆ దిక్కున ఉండాలి - లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?'

పూజ గదిలోని ఈ వస్తువులను కింద పెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details