Narmada Pushkaralu 2024 :ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి వచ్చే అతి పెద్ద పండుగ పుష్కరాలు. దేశంలోని 12 ప్రధాన పుణ్య నదులకు ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరాలు జరుగుతాయి. 2024 మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు జరగనున్నాయి.
నదికి పుష్కరాలు ఎందుకు వస్తాయి?
మానవులు తాము చేసిన పాపాలను పోగొట్టుకోడానికి పవిత్ర నదుల్లో స్నానం చేస్తుంటారు! ఆ పాపాలన్నీ నదులలో కలియడం వల్ల నదులు అపవిత్రం అవుతున్నాయి! ఈ విధంగా నదులన్నీ అపవిత్రమై బాధపడుతుంటే చూడలేని పుష్కరుడు అనే మహానుభావుడు, బ్రహ్మ గురించి తపస్సు చేసి తనను ఒక పవిత్రమైన క్షేత్రంగా మార్చమని వేడుకుంటాడు. అప్పుడు బ్రహ్మ సంతసించి దేవ గురువైన బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి అనుసంధానమై ఉన్న నదిలో ప్రవేశించి ఏడాది పాటు ఆ నదిలో ఉండమని చెప్తాడు. అందుకు సంతసించిన పుష్కరుడు బ్రహ్మకు నమస్కరించి కార్యార్థియై బయలుదేరుతాడు.
పుష్కరుని రాకతో నదులకు ప్రవిత్రత
మానవుల పాపాలతో అపవిత్రమైన నదీజలాలు పుష్కరుని రాకతో పవిత్రతను పొందుతాయి. పుష్కరుడు నదిలో చేరగానే ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి సప్త మహా ఋషులు ఆ నదికి చేరుకుంటారని శాస్త్ర వచనం. వారంతా సూక్ష్మ శరీరాలతో నదికి వచ్చి స్నానాదికాలు ఆచరిస్తారు. కాబట్టి ఈ ఏడాది కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారి సమస్త పాపాలు పోయి పునర్జన్మ లేకుండా శివ సన్నిధికి చేరుకుంటారని విశ్వాసం.
బృహస్పతి ఏ రాశిలో ఉంటే ఏ నదికి పుష్కరాలు వస్తాయి?
జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు భారత దేశంలోని 12 పుణ్య నదులకు ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి.
- బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు వస్తాయి.
- బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి.
- బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి.
- బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి.
- బృహస్పతి సింహ రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి.
- బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి.
- బృహస్పతి తులా రాశిలో ప్రవేశించినప్పుడు కావేరి నదికి పుష్కరాలు వస్తాయి.