Naga Panchami 2024 Pooja Vidhanam: ప్రతి సంవత్సరమూ శ్రావణ మాసం శుక్ల పక్ష పంచమి నాడు నాగ పంచమి పండగను హిందువులంతా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ రాత్రి 9.56 నిమిషాలకు నాగ పంచమి ఘడియలు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాత్రి 11.59 నిమిషాలకు పూర్తవుతుంది. సాధారణంగా హిందూ పంచాంగం ప్రకారం ఉదయం వచ్చిన తిథినే ప్రామాణికంగా తీసుకుంటారు.. కాబట్టి నాగపంచమిని ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రోజు జరుపుకుంటారు.
నాగపంచమి పూజా విధానం:
పూజకు కావాల్సిన పదార్థాలు:
- నాగేంద్రుడి ప్రతిమ - 1
- ఎరుపు, తెలుపు రంగు కలిగిన టవల్స్ - 2
- పంచామృతాలు(పాలు, పెరుగు, పండ్ల రసాలు, నెయ్యి, తేనె)
- చిమ్మిలి లడ్డులు
- పూలు, పండ్లు
- పసుపు, కుంకుమ, చందనం
- అక్షింతలు
- ధూప, దీపాలు
నాగపంచమి పూజా విధానం:నాగపంచమిని ఎవరైనా చేసుకోవచ్చని ప్రముఖ పండితులు నండూరి శ్రీనివాస్ చెబుతున్నారు. అలాగే స్త్రీ, పురుషులు ఇద్దరూ ఈ పూజా చేసుకోవచ్చంటున్నారు. ఇక పూజా విధానం చూస్తే..
- పూజ చేసేందుకు సిద్ధమయ్యే ముందు తలంటు స్నానం చేయాలి.
- ఆ తర్వాత నాగేంద్రుడికి సమర్పించేందుకు చిమ్మిలి లడ్డూలు తయారు చేసుకోవాలి.
- ఆ తర్వాత పూజ గదిలో నాగేంద్రుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అందుకోసం ముందుగా సంకల్పం చేసుకోవాలి. అంటే తెలిసీ, తెలియక చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేయమని ఆ నాగేంద్రుడిని కోరుకుంటూ సంకల్పం చేసుకోవాలి.
- సంకల్పం చేసిన తర్వాత నాగేంద్రుడి శ్లోకం చదువుతూ ధ్యానం చేయాలి.
- ఆ తర్వాత ఆవాహనం చేయాలి. అంటే నాగేంద్రుడి ప్రతిమపై చేయి పెట్టి ఆవాహన శ్లోకం చదువుకోవాలి.
- ఆ తర్వాత ప్రతిమకు అభిషేకం నిర్వహించాలి. అభిషేకం అనేది నాగేంద్రుడి పూజలో అన్నింటికన్నా ముఖ్యమైనది. కాబట్టి దీనిని తప్పనిసరిగా నిర్వహించాలి. అందుకోసం ముందుగా పంచామృతాలను కలపకుండా వేర్వేరుగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత పంచామృతాలకు సంబంధించిన ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ అభిషేకం చేయాలి. ఉదాహరణకు పాలు అభిషేకించేటప్పుడు ఓ శ్లోకం.. తేనె అభిషేకించేటప్పుడు మరో శ్లోకం.. ఇలా శ్లోకాలు చదివి అభిషేకాలు పూర్తి చేయాలి.
- అభిషేకాలు పూర్తైన తర్వాత శుద్ధోదకం చేయాలి. అంచే స్వచ్ఛమైన జలం తీసుకుని నాగేంద్రుడిని అభిషేకించాలి. ఇలా చేస్తే అభిషేకం పూర్తయినట్లు.
- ఆ తర్వాత వస్త్రం సమర్పించాలి. అంటే ఎరుపు, తెలుపు రంగు టవళ్లను "వస్త్ర యుగ్మం" అని చెప్పి స్వామి వారికి సమర్పించాలి.
- ఆ తర్వాత మానసదేవికి సంబంధించిన స్తోత్రము చదవాలి. మానసదేవీ అంటే అపూర్వమైన నాగ శక్తి అంటున్నారు నండూరి శ్రీనివాస్.
- ఇక ఆ తర్వాత ధూప, దీప, నైవేద్యాలు, నీరాజనం, నమస్కారం చేయడంతో పూజా పూర్తయినట్లని చెబుతున్నారు.
- నైవేద్యం పెట్టేటప్పుడు పండ్లతో పాటు చిమ్మిలి తప్పకుండా పెట్టాలంటున్నారు. చిమ్మిలి పెట్టి హారతి ఇస్తే నాగ పంచమి రోజు చేసుకునే పూజ అయిపోయినట్లే.
చిమ్మిలి తయారీ విధానం: