Morning Rituals for Good Luck :చాలా మందికి ఉదయాన్నే నిద్రలేవగానే అర చేతులు చూసుకుని దైవాన్ని స్మరించుకోవడం అలవాటుగా ఉంటుంది. మరికొంతమంది నిద్రలేచిన తర్వాత నేలను తాకి నమస్కరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల సానుకూల దృక్పథం అలవడుతుందని, అలాగే రోజంతా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తారు. అయితే.. రాత్రి నిద్రపోయే ముందు, అలాగే పొద్దున నిద్ర లేవగానే కొన్ని నియమాలుపాటించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు వేణుగోపాల్ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది.. ఉదయం నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు కాలంతో పరుగులు తీస్తున్నారు. ఆఫీసు, వ్యాపార కార్యకలాపాల్లో ఒత్తిడితో రాత్రి వచ్చే సరికి ఎంతో అలసిపోతున్నారు. దీంతో రాత్రి మంచి నిద్రకు దూరమైపోతున్నారు. అయితే, ఇలాంటి వారు నిద్రించేటప్పుడు శివనామస్మరణ చేయడం వల్ల త్వరగా నిద్రపడుతుందని వేణుగోపాల్ చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే నిద్ర నుంచి మెలకువ రాగానే విష్ణు నామాన్ని జపించాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు.
నిద్ర లేచిన తర్వాత:
ఉదయాన్నే నిద్రలేచి విష్ణు నామాన్ని జపించిన తర్వాత వీలైతే ఇలా చేయండి. మీ కాలి బొటన వేళ్లపైన నిలబడి.. రెండు చేతులను ఆకాశం వైపు చూపిస్తూ ఉంచండి. ఇలా ఒక రెండు నిమిషాల పాటు చేయాలి. ఇలా చేస్తే సర్వాంతర్యామి అయిన అద్వితీయమైనటువంటి దివ్యశక్తి మీ శరీరంలోకి ప్రవహిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుంది. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ దైవానుగ్రహం మీ వెంట ఉంటుందని వేణుగోపాల్ చెబుతున్నారు.
ఇష్ట దైవన్ని స్మరించుకోండి :