Mantras To Help You Manage Pregnancy :నేటి రోజుల్లో చాలా మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. అయితే, అంత ప్రయత్నించినా సంతానప్రాప్తి కలగకపోవడానికి.. బలీయమైన ప్రారబ్ధ కర్మే కారణం కావొచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అంటే.. పూర్వ జన్మలో కానీ, ఈ జన్మలో కానీ కొన్ని రకాల తప్పులు చేయడం. వాటి ఫలితంగానే సంతానలేమి(Childlessness)సమస్యలు తలెత్తుతుండొచ్చంటున్నారు. అయితే, ఆ కర్మ ఫలితాల నుంచి విముక్తి పొంది.. సంతానం పొందాలంటే ఏం చేయాలి? జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సంతానలేమికి కారణమవుతున్న కర్మ ఫలితాల నుంచి విముక్తి పొందాలంటే.. పరమేశ్వరుడు చెప్పిన "పుత్రకామేష్టి శ్లోకం" పారాయణం చేయాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు నండూరి శ్రీనివాస్. అసలు.. పుత్రకామేష్టి శ్లోక పారాయణం అంటే ఏంటి? దాన్ని ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ పారాయణం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
రామాయణం బాలకాండలోని 15, 16 సర్గలను 'పుత్రకామేష్టి సర్గలు' అని కూడా పిలుస్తారు. ఇందులో కొన్ని శ్లోకాలు ఉంటాయి. వాటిని పారాయణం చేయడమే.. పుత్రకామేష్టి శ్లోక పారాయణంగా చెప్పుకోవచ్చు. ఆ సర్గలలో ఏముందంటే.. వాటిల్లో దేవతలు శ్రీ మహవిష్ణువు దగ్గరకి వెళ్లి.. "రావణాసురుడు(అంటే ప్రారబ్ధ కర్మ) ఏడిపించేస్తున్నాడు. మమ్ముల్ని అనుగ్రహించు స్వామి" అని వేడుకొంటారు. అప్పుడు "నేను(మహవిష్ణువు) దశరథుడి ఇంట్లో పుడతానg" అని చెబుతాడు. అప్పుడు దశరథుడు పుత్రకామేష్టి పారాయణం చేస్తుంటే.. పాయస పురుషుడు వచ్చి పాయసం ఇస్తాడు. దాన్ని దశరథుడు భార్యలకు పంచితే వాళ్లు అది తీసుకొని గర్భవతులు అవుతారట. ఇది ఆ రెండు అధ్యాయాలలో పేర్కొన్న కథ. కాబట్టి.. సంతాన లేమి సమస్యలతో బాధపడే వారు పుత్రకామేష్టి శ్లోక పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు పండితులు శ్రీనివాస్.
ఇంతకీ ఈ పారాయణ వ్రతం ఎలా చేయాలంటే?
ఈ పారాయణ వ్రతాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలి. ఇందుకోసం ముందుగా దంపతులు స్నానమాచరించి రెడీ అయి.. పూజా మందిరంలో రాములవారి విగ్రహాన్ని పూలతో అలంకరించుకోవాలి. ఆపై భక్తిశ్రద్ధలతో ముందుగా రామ రక్ష స్తోత్రం పఠించి.. తర్వాత బాలకాండలోని 15, 16 సర్గలలో ఉన్న శ్లోకాలను పారాయణం చేయాలి. అలాగే.. దూపం, ధీపం, నైవేద్యం వంటి పంచోపచారాలు చేయాలి. అయితే, సంస్కృతం చదవడం రానివారు.. బయట మార్కెట్లో లభించే పాటల సీడీలు తెచ్చుకొని వినవచ్చట. ఏదేమైనప్పటికీ నియమనిష్ఠలతో ఈ పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
నైవేద్యంగా ఏం పెట్టాలంటే?