January 13th 2025 Daily Horoscope :సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్సాహంగా భోగి పండగ జరుపుకుంటున్నారు. మరి, భోగి పండగ ఏ రాశి వారికి ఎలా ఉంది? ఈ రోజున ఏం చేయాలి? అనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మేషం (Aries) :మేష రాశి వారు ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే, శత్రుత్వ బాధలు ఎదురవుతాయి. కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని రకాల చిక్కులు ఎదురవుతాయి. కానీ, అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే పనులు కొంచెం ఆలస్యం అవుతుంటాయి. అయినప్పటికీ ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో మనోవిచారంగా ఉంటారు. దానిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంతిమంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మిథునం (Gemini) :మిథున రాశి వారు ఈ రోజు బంధువులను కలుసుకుంటారు. వాళ్ల ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. ఈ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారు ఈరోజు దేవుడి అనుగ్రహం, గురుబలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం ఉంటుంది.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు వ్యాపార పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు కుటుంబ పరంగా కొన్ని చిక్కులు, చికాకులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధనపరంగా ఇబ్బందులు కనిపిస్తాయి. కాబట్టి, అప్రమత్తంగా ఉండాలి.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనం కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.