తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి జలగండం ఉంది- ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది! - Daily Horoscope - DAILY HOROSCOPE

Horoscope Today September 1st 2024 : సెప్టెంబర్ 1న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 3:41 AM IST

Horoscope Today September 1st 2024 : సెప్టెంబర్ 1న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికి రాదు. ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. తొందరపాటు నిర్ణయాల కారణంగా డబ్బు, సమయం వృధా కావచ్చు. కీలమైన విషయాల్లో రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. అనవసరంగా ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం వల్ల నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. మిత్రుల సహాయంతో అదనపు ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగంలో కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంటికి అతిథులు రావడం వల్ల ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆందోళనకు గురవుతారు. వ్యాపారంలో పోటీ పెరగడం వల్ల నష్టాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు గడ్డు కాలం నడుస్తోంది. ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురు కావడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఇటు అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఇతరులకు సాయం చేయబోయి చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. న్యాయపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదిత్య హృదయం పారాయణతో ప్రతికూలతలు తొలగుతాయి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉంటాయి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. ఇంట్లోనూ, పనిప్రదేశంలోనూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో సంతోషం, ఉత్సాహం వెల్లివిరుస్తుంది. గణపతి ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఎదురు కావడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ఈ రోజు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారంలో ఊహించని నష్టాలు ఉండవచ్చు. మీ పిల్లల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. విరోధులు, శత్రువులను ఎదుర్కొనేందుకు ఇది మంచి రోజు కాదు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో శత్రుజయం ఉంటుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం వుంది. అందుకే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగరంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఫలితాలు ఆలస్యమయినా నిరాశకు లోనుకావద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు, కమిషన్ వ్యాపారాలు మంచి లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి ఈ రోజు కొత్త అసైన్ మెంట్స్ మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకునే స్థిరమైన నిర్ణయాలు ఆర్థిక లాభాలను అందిస్తాయి. తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెబితే మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఎటు చూసినా శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్, కోరుకున్న చోటికి బదిలీ, జీతం పెరుగుదల వంటి శుభ ఫలితాలు ఉంటాయి. రచయితలకు, కళాకారులకు ఈ రోజు చాలా మంచి రోజు. సమాజంలో సన్మాన సత్కారాలు పొందుతారు. జలగండం ఉంది. అందుకే జలాశయాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details