తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశులవారికి ఈ రోజు విజయం సిద్ధిస్తుంది- ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది! - వార ఫలాలు

Horoscope Today March 2nd 2024 : మార్చి 2న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 2nd 2024
Horoscope Today March 2nd 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 4:56 AM IST

Horoscope Today March 2nd 2024 : మార్చి 2న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఇతరుల మనసును నొప్పించే విధంగా మాట్లాడకండి. ఏవైనా ముఖ్యమైన పనులు చేపట్టాలనే ఆలోచనలో ఉంటే వాటిని వాయిదా వేయండి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.

వృషభం (Taurus) : ఈ రోజు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ బంధువులు లేదా మీకు నచ్చినవారు ఈ రోజు మీ ఇంటికి భోజనానికి వస్తారు. ఏదైనా విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్​ చేయండి. విదేశాల్లో ఉన్న మీ బంధువుల నుంచి శుభవార్త వింటారు.

మిథునం (Gemini) :ఈ రోజు మీకు శుభసమయం గోచరిస్తుంది. ఇంట్లోస్నేహ పూర్వక వాతావరణం ఏర్పుడుతుంది. పెండింగ్​ పనులను పూర్తి చేస్తారు. ఇది మీకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇది మీ వృత్తిపై సానుకూల ప్రభావం చూపుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రోజు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అనవసరమైన ఖర్చులూ ఉంటాయి. మిమ్మల్ని ఉద్రేకానికి గురిచేసే సందర్భాలు ఎదురుకావచ్చు. ఇతరులతో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

కర్కాటకం (Cancer) :కొన్ని విషయాల్లో ఈ రోజు రాజీ ధోరణిని ప్రదర్శిస్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే అవి మీ పరిస్థితులను అధ్వానంగా మారుస్తాయి. దీని వల్ల ఏ ప్రయోజనమూ పొందలేరు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఖర్చులు అధికంగా చేస్తారు. చర్చలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.

సింహం (Leo) :ఈ రోజు మీరు పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. అవిశ్రాంతగా పనిచేయడం ద్వారా వచ్చే అలసట మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. కానీ, వాటిని తిప్పికొడతారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కొన్ని వివాదాలు తలెత్తుతాయి. మనస్ఫర్థలు ఏర్పడవచ్చు. ప్రభుత్వ, ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.

కన్య (Virgo) : మీ దగ్గరివారితో బంధం మరింత దృఢ పడుతుంది. ఈ రోజు మీ స్నేహితులను కలుసుకుంటారు. ఆఫీసులో కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మొత్తంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.

తుల (Libra) : మీ నిర్ణయాత్మక శక్తి ఈ రోజు మిమ్మల్ని కాస్త ఇరకాటంలో పెడుతుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగటం మంచిది. ఈ ధోరణి సత్ఫలితాలనిస్తాయి. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయండి. ఇంట్లో కూడా మొండి వైఖరితో కాకుండా సమన్వయ ధోరణితో మెలగటం శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :ఈ రోజువృశ్చిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మీ ప్రియమైన వారితో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీకు నచ్చినవారి నుంచి బహుమతులు స్వీకరిస్తారు. ఒక మంచి ట్రిప్​కు ప్లాన్​ కూడా చేయవచ్చు. రోజు చివర్లో ఒక మంచి శుభవార్త వింటారు.

ధనుస్సు (Sagittarius) :పనులు సులువుగా పూర్తి కావు. కుటుంబంతో వాదనలకు దిగుతారు, గొడవ పడతారు. మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకుంటే మంచిది. ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయని గ్రహబలం చెబుతోంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఖర్చులు ఉన్నాయి.

మకరం (Capricorn) :ఆర్థికంగా ఈ రోజు మీరు లాభాలు గడిస్తారు.సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలోనూ అద్భుతంగా రాణిస్తారు. మీ స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విజయం సిద్ధిస్తుంది. ఏ రంగంలో మీరు అడుగుపెట్టినా, పట్టిందల్లా బంగారమే అవుతుంది. వివాహం గురించి ఆలోచించే వారికి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రోజు మంచి రోజు. మంచి ప్రయాణం చేయండి. మీ రోజును మరింత మధురంగా మారుస్తుంది. మొత్తంగా అదృష్ట దేవత ఈ రోజు మీ వెంటే ఉంటుంది.

కుంభం (Aquarius) :ఈ రోజు సంతోషంగా గడుస్తుంది. లాభాలు ఆర్జిస్తారు. మీ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఈ రోజు శుభ సమయం. ఉద్యోగరీత్యా శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. మీ పని పట్ల పై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తారు. మిమ్మల్ని ప్రశంస్తిస్తారు. మీకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు మీతో ఎప్పుడూ ఉంటాయి. కావునా ధైర్యంతో ముందుకు సాగండి.

మీనం (Pisces) :ఈ రోజు మీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే సాయంత్రానికి పరిస్థితులు కాస్త మెరుగుపడవచ్చు. సోమరితనాన్ని పక్కకు పెట్టండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. తద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. వృత్తిపరంగా పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. నిర్ణయాలు తీసుకునే సమయంలో అప్రమత్తత పాటించండి. లేదంటే వాటిని వాయిదా వేయడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details