తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి పట్టిందంతా బంగారమే! వ్యాపారులకు ఫుల్​ ప్రాఫిట్! - Horoscope Today June 3rd 2024 - HOROSCOPE TODAY JUNE 3RD 2024

Horoscope Today June 3rd 2024 : జూన్​ 3న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today June 3rd 2024
Horoscope Today June 3rd 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 4:28 AM IST

Horoscope Today June 3rd 2024 : జూన్​ 3న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ఈరోజు సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం సహకరించదు. కోపాన్ని నియత్రించుకుంటే మంచిది. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకూల ఫలితాల కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మంచిది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రత, చిత్తశుద్ధితో పనిచేసి మంచి విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరుగుదల, పదోన్నతి ఉండవచ్చు. స్థిరాస్తి రంగం వారికి సత్ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. ఈశ్వరాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి గొప్ప విజయాలు ఉంటాయి. వ్యాపారులకు వ్యాపారంలో అభివృద్ధి, లాభాలు ఉంటాయి. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది, పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి పట్టింది అంతా బంగారం అవుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనులలో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులపై శ్రద్ధ పెడతారు. ఆర్థిక ఎదుగుదలకు నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శక్తినిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు ఆశించిన ఫలితాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగస్తులు చేసే పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు. వ్యాపారస్తులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. పట్టుదలతో ముందుకెళ్తే విజయం వరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు స్థాన చలనం, పదోన్నతి సూచనలున్నాయి. బంగారు, వెండి వ్యాపారులకు, స్థిరాస్తి రంగం వారికి లాభాల పంట పండుతుంది. హనుమాన్ ఆలయ సందర్శన శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఉగ్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. శ్రీ హనుమాన్ దండకం పారాయణ శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం రోజు మొత్తం సానుకూలంగా ఉంటుంది. మీ విరోధులు ఈ రోజు వారి ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివాలయ సందర్శన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వరుస అపజయాలతో నిరాశకు లోనవుతారు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు దూరప్రాంతాలకు బదిలీ కావచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే పనిలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. బంధుమిత్రుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పరోపకారంతో, సద్బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. అవసరానికి డబ్బు అందుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. గత రెండు రోజులుగా బాధించిన సమస్యలు దూరమవుతాయి. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. వృత్తిఉద్యోగ వ్యాపార రంగాల వారికి విశేషమైన కృషితో విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేని మీ వైఖరి కారణంగా అందరికీ విరోధం అవుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. బంధుమిత్రులతో చేసేవాకలహాలకు ఆస్కారముంది. ఉద్యోగవ్యాపారాలు చేసేవారికి ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. ఇష్ట దేవతారాధన ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details