తెలంగాణ

telangana

స్థిరాస్తి వ్యాపారులకు శుభ సమయం- ఆ రాశి ఉద్యోగస్థుల ట్రాన్స్​ఫర్​కు ఛాన్స్​​! - Daily Horoscope In Telugu

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 4:38 AM IST

Horoscope Today July 17th 2024 : జులై​ 17న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today July 17th 2024
Horoscope Today July 17th 2024 (ETV Bharat)

Horoscope Today July 17th 2024 : జులై​ 17న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం నడుస్తున్నందున వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక లాభాలున్నాయి. మీ స్వధర్మంతో పాటు దైవ బలం కూడా అండగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. కుమారస్వామి ధ్యానం శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చపల చిత్తం లేకుండా స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగితే అన్నింటా శుభ యోగాలుంటాయి. వ్యాపారంలో విశేషమైన ధనలాభాలుంటాయి. ఉద్యోగస్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉన్నత పదవుల కోసం తీవ్రంగా శ్రమించాలి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు తారసపడతారు. చూసీ చూడనట్లు వ్యవహరిస్తే సమస్యలుండవు. నవగ్రహ ఆరాధనతో శుభ ఫలితాలుంటాయి.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఉద్యోగస్థులు నూతన బాధ్యతలు చేపడతారు. స్థానం చలనం కూడా ఉండవచ్చు. వృత్తి నిపుణులు అద్భుతంగా పనిచేసి సమస్యలు అధిగమిస్తారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వ టెండర్ల విషయాల్లో నిదానించి వ్యవహరిస్తే మంచిది. స్థిరాస్తి వ్యాపారులకు శుభ సమయం నడుస్తోంది. కొనుగోలు అమ్మకాలు జోరందుకుంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలో ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఈ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగస్థులు పనిపట్ల అంకితభావంతో పని చేసి ఉన్నత పదవులు అలంకరిస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈశ్వర ఆరాధన మేలు చేస్తుంది

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాలవారు తమ తమ రంగాల్లో ఆచి తూచి అడుగు వేయాలి. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలకమైన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. వ్యాపారస్థులు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు కాదు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. పరోపకారానికి పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది. ఆంజనేయ స్వామిని ప్రార్ధిస్తే ఆపదలు తొలగుతాయి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. కష్టించి పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. విశేషమైన దైవబలం ఉంది. ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన ఉత్తమం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనులు మందకొడిగా సాగుతాయి. కొత్తగా ఏ పనులు మొదలు పెట్టవద్దు. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలకమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. వ్యాపార వ్యవహారాల్లో మొహమాటాలకు పోకుండా నిక్కచ్చిగా ఉంటేనే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంపద పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చిత్తశుద్ధితో పని చేసి అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలకమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన బాధ్యతలు సమర్ధంగా నిర్వర్తిస్తారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. గ్రహ సంచారం శుభకరంగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. చక్కని వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో దృష్టి సారిస్తే మంచిది. ఉద్యోగస్థులకు స్థానచలనం సూచనలు ఉన్నాయి. శ్రీవిష్ణుమూర్తి ఆరాధన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాలవారు బుద్ధిబలం, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఊహించని శుభఫలితాలు ఉంటాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతోంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మొహమాటాలకు పోయి ఇబ్బందులు పడవద్దు. ఆర్థిక విషయాలలో నిక్కచ్చిగా ఉంటే మంచిది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ విష్ణు సహ్రస్రనామ పారాయణ శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా మాట్లాడవద్దు. వారు ఆగ్రహిస్తే మీ ఉద్యోగానికి ప్రమాదం. వ్యాపారంలో పోటీదారులు, విరోధులు కలిసికట్టుగా దాడి చేసే ప్రమాదముంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఆర్ధికంగా కూడా నష్టాలు ఏర్పడవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details