Cricketers Re Entry After Accident: ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రికెట్‌కు ఉండే ఆదరణే వేరు. తమ అభిమాన ఆటగాళ్లను క్రికెట్ ప్రియులు ఎంతగానో ఆరాదిస్తారు. వారికి చిన్న గాయమైనా తట్టుకోలేరు. అయితే ఈ స్టోరీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మరణాన్ని జయించి, తిరిగి మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
రిషబ్ పంత్
రోడ్డు ప్రమాదం బారిన పడిన క్రికెటర్లలో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒకడు. 2022 డిసెంబర్ 30న రూర్కీలో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ యాక్సిడెంట్లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. మరణం అంచులదాకా వెళ్లి కోలుకుని ఐపీఎల్ 2024 సీజన్లో రీఎంట్రీ ఇచ్చారు. అలాగే టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా తరఫున బరిలో దిగి ఫర్వాలేదనిపించాడు.
ఒషానే థామస్
వెస్టిండీస్ క్రికెటర్ ఒషానే థామస్ 2020లో జమైకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కారు రోడ్డుపై బోల్తా కూడా కొట్టింది. దీంతో కొన్నాళ్లపాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు ఒషానే. ఆ తర్వాత కోలుకుని క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
కౌశల్ లోకురాచ్చి
శ్రీలంక స్పిన్నర్ కౌశల్ లోకురాచ్చి కారు 2003 ఆగస్టులో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్లో కౌశల్ భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఓ మహిళ కూడా మృతి చెందింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కౌశల్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత దాన్ని ఎత్తివేసింది. దీంతో కౌశల్ మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చి 2012లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 20 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ యాక్సిడెంట్ లో మన్సూర్ కుడి కన్ను తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత కోలుకుని టీమ్ఇండియా తరఫున మైదానంలోకి దిగాడు. 46 టెస్టు మ్యాచుల్లో రెండు వేలకు పైగా పరుగులు చేశాడు.
కరుణ్ నాయర్
టీమ్ఇండియా క్రికెటర్ కరుణ్ నాయర్ 2016లో పడవ ప్రమాదానికి గురయ్యాడు. కేరళలోని ఓ దేవాలయానికి వెళ్తుండగా జరిగిందీ ఘటన. అయితే స్థానికులు పడవ ప్రమాదం నుంచి కరుణ్ నాయర్‌ను కాపాడారు. దీంతో నాయర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
Eventful weekend. 🏏#RP17 pic.twitter.com/gVTCBPHlmq
— Rishabh Pant (@RishabhPant17) September 8, 2024
రిషభ్ పంత్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..
'ఆ ఏడు నెలలు నరకం అనుభవించాను - కనీసం బ్రష్ కూడా చేయలేకపోయా ' - Rishabh Pant Latest Interview