ఆ కళాశాలలో 150 విద్యార్థులకు ఒక్కటే టాయిలెట్ - ఇదీ మద్దూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ దుస్థితి - lack of toilets in govt college - LACK OF TOILETS IN GOVT COLLEGE
🎬 Watch Now: Feature Video
Published : Sep 13, 2024, 5:36 PM IST
Lack Of Toilets in Govt College : సిద్దిపేట జిల్లా మద్దూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల లేమితో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 150 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ కళాశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. 90 మంది అమ్మాయిలకు ఒకటే టాయిలెట్. అది కూడా అధ్వాన్నంగా ఉండటంతో క్యూకట్టి ఒకరి తర్వాత మరోకరు వెళ్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా సమయం వృథాఅయి క్లాసులు వినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అబ్బాయిల పరిస్థితైతే మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు బయట మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన దుస్థితి. బయటకు వెళ్లినపుడు పాములు, తేళ్లు వంటి విష కీటకాలు కాటువేసే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు ఇలా ఉంటే తాము చదువుకునేదెలా? అని వాపోతున్నారు. అధికారులు స్పందించి కళాశాలలో మూత్రశాల ఏర్పాటు చేసి వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.