ETV Bharat / spiritual

ఆ రాశి వారు కోపాన్ని కంట్రోల్​లో ఉంచుకోవాల్సిందే- లేకుంటే శత్రువులు పెరగడం ఖాయం! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today 13th September 2024 : 2024 సెప్టెంబర్ 13వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 3:49 PM IST

Updated : Sep 13, 2024, 6:07 AM IST

Horoscope Today 13th September 2024 : 2024 సెప్టెంబర్ 13వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే శత్రువులు పెరిగే ప్రమాదముంది. అది మీ పనిని మాత్రమేగాక మీ సంబంధాలను కూడా పాడుచేస్తుంది. కోపావేశాలు అదుపులో ఉంచుకోకపోతే పని మీద దృష్టి సారించలేరు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం లేక నిరాశకు లోనవుతారు. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు కాదు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. దైవబలం మీద విశ్వాసం ఉంచితే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణంతో మెరుగైన ఫలితాలుంటాయి.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఆదాయం పెరుగుదల వంటి ప్రయోజనాలుంటాయి. స్నేహితులతో , కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల రాకతో ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు చాలా మంచి రోజు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. శివారాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించడం వల్ల ఈ రోజు సంతోషంగా గడుపుతారు. కవులు, రచయితలకు కల్పనా శక్తి వెయ్యింతలవుతుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. సంతానం పురోగతి పట్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలం కాదు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడి అనుభవిస్తుంటారు. ప్రియమైన వారితో కలహాల కారణంగా అశాంతితో ఉంటారు. మీ తల్లి గారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ జాగ్రత్త పరచండి. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా వెచ్చించి వృత్తి వ్యాపారాలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. పని పట్ల మీ అంకితభావానికి ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. మీ సోదరులతోనూ, రక్త సంబంధీకులతోనూ అనుబంధాలు దృఢ పడతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. శ్రీలక్ష్మిగణపతి ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలుంటాయి.

.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్ధికంగా కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగితే మనస్పర్థలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశి వారికి ఈ రోజు కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. కుటుంబసభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడంతో మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం వుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యాలను సాధించే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో, దైవబలంతో ఎదుర్కొంటారు. చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది. కుటుంబ కలహాల కారణంగా సంబంధాలు దెబ్బతినవచ్చు. వ్యాపారస్తులకు వృధా ప్రయాణాలు ఉండవచ్చు. ఆధ్యాత్మికమైన విషయాలపై దృష్టి సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గణపతి ప్రార్ధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధనపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే ఆటంకాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్ధిక విషయాల్లో గందరగోళం నెలకొంటుంది. సహనం కలిగివుండాలి! భవిష్యత్ పట్ల సానుకూల దృక్పధంతో ఉంటే మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆశించిన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలలో చిత్తశుద్ధితో పనిచేసి తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. లక్ష్మీకటాక్షం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. కొత్త పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

Last Updated : Sep 13, 2024, 6:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.