Horoscope Today January 3rd 2025 : 2025 జనవరి 3వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఫలవంతగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ రోజు అనవసరమైన వాదనలు, అర్ధంలేని చర్చలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సమస్యల పరిష్కారం కఠినంగా ఉంటుంది. ఈ ప్రభావం ఆరోగ్యం పైన ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో మెలగడం అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించడం వలన ప్రయోజనం ఉంటుంది.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతికూల ఆలోచనల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి. కోపావేశాలను నియత్రించుకోండి. వ్యాపారంలో తరచూ ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే కొత్త పనులకు ఈ రోజు దూరంగా ఉండండి. కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు సవాళ్లు ఎదురవుతాయి. మనోనిబ్బరంతో ఉంటే సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర సంఘటనలు, శుభకార్యాలు జరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన పురోగతితో సంతృప్తిగా ఉంటారు. పని ప్రదేశంలో అనుకూలమైన, ఉత్సాహపూరితమైన వాతావరణం ఉండడంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మిత్రుల సహకారంతో చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకోని సంపదలు కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. స్వబుద్ధితో ఆలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి, ఆర్థికప్రయోజనాలుంటాయి. విలాసాల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం రావచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లుతుంది. గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మీ మాట తీరుతో చిక్కుల్లో పడతారు. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆర్థికలావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ సున్నిత స్వభావం అవకాశవాదులకు అనుకూలంగా మారే ప్రమాదముంది. మీ మనస్తత్వం విజయానికి ఆటంకంగా మారకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి అడుగు వేయడం అవసరం. ఆర్థికవ్యవహారాలలో అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే ప్రమాదముంది. కుటుంబం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శనిస్తోత్రం పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తారు. మత పరమైన కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. కోర్టులో పెండింగు ఉన్న లీగల్ వ్యవహారాలు సెటిల్ చేసుకుంటారు. అన్ని రంగాల వారికి వృత్తిలో విజయం వరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అనేక సవాళ్లు ఉంటాయి. వేగంగా, ఆ క్షణానే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మానసికంగా దృఢంగా ఉండండి. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఓ సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివారాధనతో శుభ ఫలితాలు ఉంటాయి.