తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి పండగ వేళ ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాలు- ఆదిత్య హృదయం పారాయణ మేలు! - HOROSCOPE TODAY JANUARY 14TH 2025

2025 జనవరి​ 14వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు

Horoscope Today January 14th 2025
Horoscope Today January 14th 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2025, 6:34 AM IST

Horoscope Today January 14th 2025 : 2025 జనవరి​ 14వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అవసరానికి ధనం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేష్టం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో అధిగమిస్తారు. కోరి సమస్యలను పెంచుకోవద్దు. కొన్ని పరిస్థితులు మనస్తాపాన్ని కలిగిస్తాయి. మీ బుద్ధి బలంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగంలో స్థాన చలనం సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధనతో క్రమంగా అనుకూలత పెరుగుతుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. గతాన్నిమరిచి భవిష్యత్తుపై దృష్టి సారించడం మంచిది. గతం నీడ వర్తమానం, భవిష్యత్ పై పడకుండా చూసుకోండి. కీలక వ్యవహారాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటికి బంధు మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. షేర్లు, స్టాకుల ద్వారా ఆర్థిక లబ్ధి అందుతుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. పాత బకాయిలు క్లియర్ చేస్తారు. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. వినోదం మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ ఖ్యాతి, ప్రజాదరణ నలువైపుల నుంచి బాగా పెరుగుతుంది. డబ్బు రాక కూడా గణనీయంగా పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు అదృష్టకరమైన రోజు. దైవబలంతో క్లిష్టమైన పనులు కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు పొందుతారు. బంధు మిత్రులతో కలిసి ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదేవత స్తోత్రం పఠించడం ఉత్తమం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. గొప్ప సంకల్ప బలంతో ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పట్టుదలతో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగంలో పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. పెద్దల సలహాతో ముందుకెళ్తే మనఃసౌఖ్యం ఉంటుంది. మీ భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది. అభయ ఆంజనేయస్వామి ప్రార్థన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో గణనీయమైన లాభాలు వస్తాయి. చేసే ప్రతి ప్రయత్నం ఫలించి విజయం సిద్ధిస్తుంది. బంధు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. పట్టుదలతో పనిచేస్తే కార్యసిద్ధి ఉంటుంది. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజంతా బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇష్ట దేవత ఆలయ సందర్శన శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల ప్రవర్తన విచారం కలిగిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details