తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు ఖర్చులను కంట్రోల్ చేసుకుంటే మంచిది- లేకుంటే ఇబ్బందులు తప్పవ్​! - DAILY HOROSCOPE IN TELUGU

2025 ఫిబ్రవరి 3వ తేదీ (సోమవారం) రాశిఫలాలు

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2025, 3:03 AM IST

Horoscope Today February 3rd 2025 : 2025 ఫిబ్రవరి 3వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు చాలా శక్తివంతంగా భావిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు ఉత్సాహంతో పనిచేసి ఆటంకాలు అధిగమిస్తారు. గృహ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. కుటుంబంతో నాణ్యమైన సమయం గడుపుతారు. సమావేశాలలో చర్చలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అనారోగ్యం కారణంగా విచారంగా ఉంటారు. చేపట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. వ్యయాలను అదుపులో ఉంచుకోండి. నిజాయితీతో కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించండి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికి అధిగమిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు అందుకుంటారు. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు చోటు చేసుకోవచ్చు. ప్రమాదకర ప్రయాణాలకు దూరంగా ఉండండి. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆటంకాలు చికాకు కలిగిస్తాయి. పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. గృహాలంకరణ కోసం అధిక ధనవ్యయం చేస్తారు. బంధువులతో కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ధార్మిక, పవిత్రకార్యాలలో నిమగ్నం అవుతారు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. విదేశీ మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కొన్ని సంఘటనలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. ధనాదాయం పెరగడం ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యా రాశివారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఈ రోజు ఈ రాశి వారికి ప్రజాదరణ, అధికారం, గౌరవం, ఆర్ధిక వృద్ధి ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్సన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్ధిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. రుణభారం పెరగవచ్చు. అనారోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. తప్పుదోవ పట్టించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శని శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో, ఉత్సాహంగా కృషి చేస్తే చేపట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయండి. విద్యార్ధులు చదువులో రాణిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఇస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సుబ్రహ్మణ్యుని ఆలయ సందర్శన శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఊహించని సంఘటనలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఆర్ధిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. అస్థిరమైన కుటుంబ వాతావరణం కారణంగా కుటుంబ సభ్యులతో గొడవలు పడతారు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్ధిక నష్టం కలగవచ్చు. హనుమ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించడం వలన నష్టభయం ఉండదు. లక్ష్యసాధనలో అనుభవజ్ఞుల సలహాలు పనిచేస్తాయి. రుణభారం తగ్గుతుంది. సన్మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మేలు జరుగుతుంది.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సంపద వృద్హి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. స్థిరాస్తి వ్యాపారంలో కొనుగోళ్లు అమ్మకాలు ఊపందుకుంటాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే ప్రమాదముంది జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ప్రయోజనం లేకపోవడం వల్ల నిరాశతో ఉంటారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఒక వ్యవహారంలో పెద్దలచే మాట పడాల్సి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మీ ఉత్సాహం చేయూతనిస్తుంది. కుటుంబ జీవితం స్నేహపూర్వకంగా ఉంటుంది. ధార్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలపైన అధికంగా ఖర్చు చేస్తారు. గణపతి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details