తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశులవారు ఇవాళ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకుంటే బెటర్! లేదంటే ఇబ్బందులు తప్పవు!! - వార ఫలాలు

Horoscope Today February 27th 2024 : ఫిబ్రవరి 27న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 27th 2024
Horoscope Today February 27th 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 4:59 AM IST

Horoscope Today February 27th 2024 : ఫిబ్రవరి 27న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : మేష రాశివారికి ఈ రోజు బాగుంటుంది. సకల జీవరాశిపై మమకారాన్ని చూపిస్తారు. కొన్ని రకాల గడ్డు పరిస్థితులు తొలగిపోతాయే అవకాశం ఉంది. మనశ్శాంతి లభిస్తుంది. తద్వారా మానసిక స్థితి మెరుగుపడుతుంది.

వృషభం (Taurus) : మీరు మీ ఉన్నతమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉండండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. చర్చలు, సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న వాటిల్లో అద్భుతంగా రాణిస్తారు. ఒకవేళ మీరు కోరుకున్న ఫలితం వెంటనే రాకపోయినా నిరాశ చెందకండి. పరిస్థితులు మెల్లగా మెరుగుపడతాయి. ఆరోగ్యం ఇబ్బందికి గురిచేయవచ్చు.

మిథునం (Gemini) :ఈ రోజు మీరు కన్ఫ్యూజన్​ మూడ్​లో ఉంటారు. ఎటూ తేల్చుకోలేక అయోమయ స్థితి ఏర్పడుతుంది. సున్నితంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఏదైనా ఒకదానిని మాత్రమే ఎంచుకోండి. మీ మాతృమూర్తితో సరదాగా సమయాన్ని గడపండి. ఆధ్యాత్మికపరమైన చర్చలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఆస్తులకు సంబంధించిన విషయాల గురించి జరిగే చర్చలను వాయిదా వేసుకోండి. ప్రయాణాలు దూరంగా ఉండండి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. స్నేహితులను, ప్రియమైన వారిని కలుసుకుంటారు. దీంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఉత్సాహం, శక్తితో పనులను పూర్తి చేస్తారు. మీ పోటీదారులను వెనక్కి నెట్టి విజయాన్ని సాధిస్తారు. మీరు ఇష్టపడేవారి మన్ననలు పొందుతారు. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్నపాటి విహార యాత్రకు వెళ్తారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

సింహం (Leo) :ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీకు ఏవైనా సమస్యలు వస్తే వారు మీ వెనకాల నిలబడతారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు అంత మంచి రోజు కాదు. మీరు మీ పనిపై శ్రద్ధ వహించండి.

కన్య (Virgo) : ఈ రోజు మీకు ఏ గొడవా లేకుండా గడుస్తుంది. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీ మనసుకి దగ్గరైన వారితో మీరు మనసు విప్పి మాట్లాడతారు. రుచికరమైన భోజనం చేస్తారు. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది. మీకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మీరు ఈ రోజు ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకున్నా చాలా సంతోషిస్తారు. మిగతా వారిని కూడా మీతో కలుపుకుని మీరు ఈ అదృష్టకరమైన ఘడియల్ని ఆనందించండి.

తుల (Libra) : మీకు ఈ రోజు మీకు అంతగా కలిసి రావడం లేదు. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మాట్లాడేటప్పుడు ఆలోచించకుండా మాట్లాడకండి. మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. మీకు వచ్చే అన్ని సమస్యలనూ జాగ్రత్తగా ఆలోచించి పరిష్కరించుకోవాలి.

వృశ్చికం (Scorpio) :ఆఫీసులో మీ ఇమేజ్ మారిపోవాలని మీరు ఆకాంక్షిస్తారు. మీరు కఠినంగా నిర్ణయాత్మకంగా ఉంటారు. పనికి సంబంధించిన లక్ష్యసాధనలో మీకు హద్దులేమి ఉండవు. మేధోమధనం చేసేందుకు మీరు ఇష్టపడతారు. మీ సహచరులు, బాస్​కు మీరు చక్కని ఐడియాలు ఇస్తారు.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు మీ ఆర్థిక విషయాలను బాగా మ్యానేజ్ చేసుకుంటారు. మీరు మీ పని విజయవంతంగా పూర్తి చేసుకుని మిగతా వారి పనిలో కూడా సహాయం చేస్తారు. మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రోజు బిజినెస్ పరంగా ప్రయాణం ఉండవచ్చు. మీరు మీ బాస్​ను మీ టాలెంట్​తో ఆకట్టుకుంటారు. కాబట్టి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.

మకరం (Capricorn) :ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. తారా బలం రచనా కార్యక్రమాలకీ, సృజనాత్మక, సాహితీపరమైన అన్వేషణలకూ కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనుల్లో బ్యూరోక్రసీ ఎక్కువ ఉంటుంది జాగ్రత్త. మీరు అలసిపోయి ఉంటే కాస్త విశ్రాంతి తీసుకోండి.

కుంభం (Aquarius) :ఈ రోజు చాలా ఇబ్బందులు పడడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం వుంది. అందువల్ల కోపం, చిరాకు పెరుగుతుంది. ఈ సందర్బాలను తప్పించుకోవాలంటే దేవుడిని స్మరించుకోవడం ముఖ్యం. మౌనంగా ఉండడం, ధ్యానం చేయడం మంచిది. అందువల్ల మీకు ప్రశంతంగా గడిపే అవకాశం వుంది. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ పద్దతి ద్వారా ఇతరులు బాధపడే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంతవరకూ మంచి మాటలనే మాట్లాడండి. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. అందువల్ల ఖర్చులు పెరగవచ్చు.

మీనం (Pisces) :మీ ఉత్సాహం అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు మీకు నైతికంగా చాలా అండదండలు అవసరమైనప్పటికీ, మీకు అవి అందించేందుకు ఓ వ్యక్తి తారసపడతారు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లినంత కాలం మీకు సానుకూల ఫలితాలే ఉంటాయి. పోటీలో నిలదొక్కుకునేందుకు మీ ఊహాశక్తి, సృజనాత్మకతను సద్వినియోగం చేసుకోండి.

ABOUT THE AUTHOR

...view details