తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది! ఎందుకంటే? - DAILY HOROSCOPE

2025 ఫిబ్రవరి 20వ తేదీ (గురువారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2025, 3:04 AM IST

Horoscope Today February 20th 2025 : 2025 ఫిబ్రవరి 20వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గొప్ప ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దలతో పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీ పరుష మాటలతో ఎవరిని నొప్పించవద్దు. కొత్త అసైన్ మెంట్స్, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శివాష్టకం పఠించడం శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు పొందుతారు. ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉంటుంది. సమాజంలో గౌరవమర్యాదలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. చిత్త చాంచల్యంతో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి శుభ సమయం నడుస్తోంది. కొత్త వెంచర్సు ప్లాన్ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికీ, షేర్స్​లో ఇన్వెస్ట్ చేయడానికీ ఇది అనుకూలమైన సమయం. ధార్మిక కార్యక్రమాలు, దేవాలయ సందర్శన చేస్తారు. స్వస్థానప్రాప్తి ఉంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు అందుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభకరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. పెద్దల మాటలపై గౌరవం ఉంచాలి. త్వరపడి నిర్ణయాలు చెయ్యకండి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రారంభించిన ప్రతిపనిలోను విజయం సాధిస్తారు. కొన్ని సంఘటనలు మానసిక ఆనందం కలిగిస్తాయి. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివ పంచాక్షరీ మంత్రజపం ఉత్తమం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసి అనుకున్నది సాధిస్తారు. శక్తివంతంగా, ఆత్మ విశ్వాసంతో పని చేసి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వినోద కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. కీర్తి పెరుగుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు ఉంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ పరిచయాలు మీకు కలిసి రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు కోరుకున్న ప్రతి కోరికా నెరవేరుతుంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా ఒప్పందాలు చెయ్యడానికి ఇది సరైన రోజు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఊహించని ధనాదాయాలు ఆనందం కలిగిస్తాయి. కనకధారా స్తోత్రం పఠించడం ఉత్తమం.

కుంభం (Aquarius) :కుంభవ రాశి వారికి ఈ రోజూ సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సహోద్యోగులతోనూ, పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అపనిందలు గురి కాకుండా చూసుకోండి. ప్రయాణాల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details