తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది- ఇష్ట దేవతారాధన మేలు! - HOROSCOPE TODAY FEBRUARY 15TH 2025

2025 ఫిబ్రవరి 15వ తేదీ (శనివారం)

Horoscope Today February 15th 2025
Horoscope Today February 15th 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2025, 5:00 AM IST

Horoscope Today February 15th 2025 : 2025 ఫిబ్రవరి 15వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ విష్ణుమూర్తి ఆలయం సందర్శన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సిద్ధిస్తుంది. బుద్ధిబలంతో ఓ వ్యవహారంలో శుభ ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన సమావేశాలలో మీ మాటకారితనంతో అందరినీ మెప్పిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన శుభవార్తలు అందుకుంటారు. పదిమందిలో మంచిపేరు సంపాదిస్తారు. కోపం అదుపులో ఉంచుకోండి. ఆర్థికంగా విశేషమైన లాభాలు అందుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం .

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఫలితాలు ఆలస్యం అవడం నిరాశ కలిగిస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శివారాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటారు. స్నేహితులతో, ప్రియమైనవారితో సరదాగా గడుపుడుతారు. ప్రయాణాలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కోపం, పరుష పదాల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మీరు మౌనంగా ఉండండి. వ్యాపారంలో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎవరితోనూ ఘర్షణ పడకండి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ సూచన ఉంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో కలహాలు ఏర్పడవచ్చు. ఒక సంఘటన మనస్తాపం కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. దైవారాధన మానకండి. ఆర్ధిక నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. శని శ్లోకాలు పఠిస్తే మేలు కలుగుతుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడకుండా చూసుకోండి. కోపాన్ని, అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు, విరక్తి, నిరాశ చుట్టుముడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మనశ్శాంతి కలిగిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యుని ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అన్నిరంగాల వారు ఈ రోజు గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details