తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు ఖర్చులను కంట్రోల్ చేసుకుంటే బెటర్- లేకుంటే ఒత్తిడికి లోనై! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 27th 2024 : ఆగస్టు​ 27వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 3:24 AM IST

Horoscope Today August 27th 2024 :ఆగస్టు​ 27వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని భారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. పట్టుదలకు పోకుండా సర్దుబాటు ధోరణితో ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఒత్తిడిని పక్కనపెట్టి కుటుంబ సభ్యులతో సరదాగా గడపండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో, సహచరులతో సత్సంబంధాలు కలిగిఉంటే మంచిది. వ్యాపారులు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.



వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. లక్ష్మీకటాక్షం, కార్యసిద్ధి ఉంటాయి. నూతనోత్సాహాంతో పనిచేసి అద్భుత విజయాలను సాధిస్తారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా కూడా ఈ రోజు మంచి రోజు. ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో రాణించాలంటే సమయానుకూలంగా నడుచుకోవాలి. కోపం అదుపులో పెట్టుకోకపోతే సన్నిహితులతో అనవసరమైన వివాదాలు, అపార్థాలూ ఏర్పడే అవకాశముంది. వ్యాపారంలో నష్ట సూచన ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృధా ఖర్చులు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి, ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉంటుంది. వ్యాపారంలో నికరమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. ఆదాయ వృద్ధి చెందుతుంది. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు ప్రణాళికలు వేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అవివాహితులకు కోరుకున్న వారితో వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో పనిచేసి తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. పదోన్నతులు, బదిలీ వంటి శుభ ఫలితాలను పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. స్థిరాస్తి డాక్యుమెంట్లు చూడడానికి మంచి రోజు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో విజయం, ఆర్ధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. గిట్టని వారు చేసే విమర్శలను పట్టించుకోకండి. విదేశాలలో మిత్రుల నుంచి అందిన శుభవార్తలతో మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారంలో పోటీదారులు నుంచి సవాళ్లు ఎదురవుతాయి. ప్రత్యర్థుల వైఖరి ఓ కంట కనిపెడుతూ ఉండటం అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధనతో శత్రుజయం ఉంటుంది.


వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి, ఆర్ధిక అభివృద్ధి ఉంటాయి. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల పని నుంచి విశ్రాంతి తీసుకొని కుటుంబంతో సరదాగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో విశేషమైన ధనయోగం ఉంటుంది. కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. చేపట్టిన వృత్తిలో సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. కళాకారులకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్ధిక పురోగతిని సాధిస్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యంగా అనారోగ్యం ఈ రోజు మీ ఆనందాన్ని హరిస్తుంది. కుటుంబ సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. పని ప్రదేశంలో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. సహనం, శాంతం అలవరుచుకోవాలి. ఆర్ధిక ఇబ్బందులు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి లోపిస్తుంది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారులు వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భాగస్వాముల మధ్య అభిప్రాయం భేదాలు రావచ్చు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి శుభసమయం నడుస్తోంది. కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. బంధువులలో కొందరి ప్రవర్తన మనస్తాపాన్ని కలిగించవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో కలహాల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో సమష్టి నిర్ణయాలు తీసుకోవడానికి మంచిరోజు. ఉన్నతంగా ఆలోచించి అందరి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. మీ దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details