Horoscope Today April 24th 2024 : ఏప్రిల్ 24న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు ఆర్థిక లాభాలు ఉంటాయి. చేపట్టిన అన్నీ పనులు సకాలంలో పూర్తవుతాయి. సామాజిక సంబంధాలు మెరుగు పడతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. మేధోపరమైన చర్చలలో పాల్గొంటారు. మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల గురించి ఆందోళన వదిలి ప్రశాంతంగా ఉంటే మేలు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం. ఉద్యోగులకు బదిలీ సూచన ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు తీసుకునే స్థిరమైన నిర్ణయాలు మీకు విజయాలను తెచ్చి పెడతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇంటాబయట ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా మొదలు పెట్టాలనుకున్న పనులకు సరైన సమయం కాదు. వాయిదా వేస్తే మంచిది. పిల్లల చదువులు, అనారోగ్య సమస్యల నిమిత్తం పెద్ద మొత్తంలో ధనవ్యయం అవుతుంది. మీ ఆరోగ్యం కూడా ఆందోళన కలిగిస్తుంది. శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే ఆపదలు తొలగిపోతాయి.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మానసికంగా శారీరకంగా విపరీతమైన ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో కలహాలు మానసిక అశాంతికి కారణమవుతాయి. ధన నష్టం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓపికతో సహనంతో రేపటిపై విశ్వాసంతో ఉండడం మేలు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఈ రోజు శుభకరం. కష్టపడి పనిచేసి మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. సన్నిహితులతో విహారయాత్రకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. మహిళ మూలంగా ధనలాభం ఉంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. గృహంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇంట్లో గొడవలు ఉండవు. ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా చక్కబెడతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. కష్టించి పని చేస్తే విజయం మీదే! ప్రయాణ సూచన ఉంది. వ్యాపారులు లాభాలను అందుకుంటారు. శివారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పని చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. పలు మార్గాల్లో ధనాదాయం ఉంటుంది. ఇంట్లో బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శారీకంగా దృఢంగా ఉంటారు. నూతన వస్త్రలాభం. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. శస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఉంది. మాటలు అదుపులో పెట్టుకోండి. ఇంట్లో గొడవలకు దారి తీసేలా ఏ పని చేయవద్దు. వినోదాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారితో అపార్ధాలు, అపోహలు ఏర్పడతాయి. విష్ణు సహస్రనామం పఠిస్తే మేలు జరుగుతుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజు. కుటుంబజీవితాన్ని ఈ రోజు సంపూర్ణంగా ఆనందిస్తారు. ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రలు, విందు వినోదాలతో ఈ రోజంతా సరదాగా గడిచిపోతుంది. దైవబలం అండగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. స్థిరాస్తి వ్యాపారులకు కలిసివచ్చే కాలం. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు వ్యాపారం ఆశాజనకంగా ఉండదు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చిన్నపాటి ఆక్సిడెంట్ జరిగే సూచన ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సమయం అనుకూలంగా ఉంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మి గణపతి ఆరాధన చేయండి.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంతగా సహకరించదు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసినప్పటికీ పై అధికారులు సంతృప్తి చెందరు. వ్యాపారులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు దీర్ఘకాలంలో ప్రయాజనాలు ఇస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం బాగోలేదు. కొన్ని సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో అనుకోకుండా ఇరుక్కోవడం మిమ్మల్ని ప్రమాదంలోకి నెడుతుంది. ఆరోగ్యం సహకరించదు. వైద్య ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతికి గురవుతారు. ప్రతికూల ఆలోచనలు వీడండి. దైవంపై విశ్వాసం ఉంచి ఆంజనేయస్వామికి ప్రదక్షిణాలు చేయండి. ఆపదలు తొలగిపోతాయి.