Horoscope Today April 23rd 2024 : ఏప్రిల్ 23న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రులతో విహారయాత్రకు వెళతారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం నడుస్తోంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు ఈ రాశి వారు ఈ రోజు అందుకోబోతున్నారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కష్టకాలం. విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి. వృత్తివ్యాపారాల వారు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆందోళనకర పరిస్థితుల నుంచి రక్షణ కోసం ఆంజనేయ స్వామిని దర్శించండి.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో ఉద్రేకపూరిత వాతావరణం ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. ఇంట్లోని సమస్యల ప్రభావం పనిపై పడకుండా చూసుకోవాలి. లక్ష్య సిద్ధి కోసం కష్టపడి పని చేయండి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉండదు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారిని చాలాకాలం తర్వాత కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల వారు ఆత్మ విశ్వాసంతో పనిచేసి మంచి విజయాలను అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే తీసుకోవడం మేలు. శివారాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభతో అందరినీ ఆకర్షిస్తారు. ఇంటా బయటా అందరి ప్రశంసలు పొందుతారు. సమర్ధవంతంగా పనిచేసి విజేతగా నిలుస్తారు. మీ పోటీదారులు తమ ఓటమిని అంగీకరించి పక్కకు తప్పుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకొని ముందుకెళ్లండి. నవగ్రహ ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.
కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఆకట్టుకునే మీ మాటతీరుతో అందరినీ ఆకర్షిస్తారు. ప్రియమైన వారితో అనుభంధాలు దృఢ పడతాయి. మీ సన్నిహితులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయికి మీరు ఎదుగుతారు. అసూయపరులతో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. అనేక మార్గాల ద్వారా ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. సూర్య ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. తగినంత విశ్రాంతి అవసరం. చిన్న చిన్న విషయాలకు చికాకు పడుతుంటారు. మీ పరుషమైన మాటలతో సన్నిహితులను బాధ పెడతారు. వాదనలు పెట్టుకోకుండా సమన్వయ ధోరణి ప్రదర్శించడం అవసరం. కోర్టు వ్యవహారంలో వ్యతిరేకత ఉంటుంది. శివారాధన చేస్తే పరిస్థితులు చక్కబడతాయి.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు తారాబలం అద్భుతంగా ఉంది. వృత్తి వ్యాపారాల వారికి, ఉద్యోగులకు కలిసి వచ్చే కాలం. అన్ని రంగాల వారికి ఆర్ధిక ప్రయోయోజనాలు మెండుగా ఉన్నాయి. బంధుమిత్రులతో విహారయాత్రకు వెళతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అహంకారంతో వ్యవహరించేవారికి దూరంగా ఉంటేనే మేలు. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఇంటా బయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా బలపడతారు. బంధుమిత్రులతో విహారయాత్రకు వెళతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, జీతం పెరుగుదల ఉంటాయి. స్థిరాస్తి వ్యాపారులకు కలిసివచ్చే కాలం. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం చదవండి.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణానికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. దైవదర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది. వృత్తి పరంగా బాగా రాణిస్తారు. ఆలయాల సందర్శన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు కొంత వ్యతిరేకంగా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. ఇతరులతో వాదనకు దిగకపోవడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. శివ స్తోత్రం సత్ఫలితాలను ఇస్తుంది.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజు ప్రథమార్ధం అంతా స్నేహితులతో సరదాగా గడుపుతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇంట్లోని వాతావరణం ఆందోళనకరంగా ఉంటుంది. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం సహకరించదు. ఆర్ధిక నష్టం కూడా ఉండే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠించండి.