Horoscope Today April 22nd 2024 : ఏప్రిల్ 22న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సత్ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. పలు మార్గాల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. ఈ రోజంతా మీరు సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు చక్కని పురోగతి ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు అఖండ విజయాలను సాధిస్తారు. నరదృష్టి నుంచి కాపాడుకోడానికి దుర్గాదేవి ధ్యానం చేయండి.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ ప్రతిభతో, ముక్కుసూటి మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యులతో జరిపే చర్చలు ఫలించవు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారులు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన వల్ల ప్రశాంతత పొందుతారు.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈరోజు గ్రహ సంచారం బాగా లేనందున అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో అశాంతి కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ప్రయాణాలు వాయిదా వేయండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక సందిగ్ధంలో ఉండిపోతారు. ఇంట్లో గొడవలకు, వాదనలకు ఆస్కారమీయవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సోదరుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. వృత్తి పరంగా ఈ రోజు చేసే అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ కష్టానికి కొంచెం ఆలస్యంగానైనా మంచి ఫలితాలు వస్తాయి. నిరాశకు లోను కావద్దు. రానున్నది మంచి కాలం. కుటుంబసభ్యులతో మంచి సమయాన్ని గడపండి. మనసుకు ఊరటనిచ్చే వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మేలు. ముఖ్య వ్యవహారాల్లో నిర్ణయం మీకు అనుకూలంగానే వస్తుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన చేయండి.
కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ రావడం వల్ల గృహంలో సంతోషం నెలకొంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఎటు చూసినా వ్యతిరేకత కనబడుతోంది. ఇందుకు కారణం మీ కోపం, ఇతరులతో మీరు మాట్లాడే విధానం. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు అవుతుంది. వీలైనంత వరకు మౌనమే శరణ్యం. వ్యాపారంలో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరితోనూ ఘర్షణలు వద్దు. ఆంజనేయస్వామిని ప్రార్ధిస్తే కొంతవరకు మేలు.
వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఇది ఒక అద్భుతమైన రోజు. ఈ రోజు మీ కోసం అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. మీకు నచ్చినది ఎంచుకొని ముందుకు సాగండి. చేసే ప్రతి పనిలోనూ విజయం మీ వెన్నంటే ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ధన ప్రవాహం ఉంటుంది. వివాహా ప్రయత్నాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్ధతను నిరూపించుకుంటారు. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రయోజనకరంగా ఉంటాయి. దైవబలం మీ వెంటే ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆంజనేయస్వామిని ప్రార్ధిస్తే కార్యసిద్ధి కలుగుతుంది
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవివాహితులు తమ కాబోయే జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ధన నష్టం సూచితం. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు. శివారాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కొన్ని వాస్తవ సంఘటనల కారణంగా మీరు ఆందోళనకు గురవుతారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. మానసిక ప్రశాంత కోసం యోగా, ధ్యానం చేయండి. బుద్ధికి పదును పెట్టి కష్టపడి పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత అవసరం. హనుమాన్ చాలీసా పఠించండి.
మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. చిత్రసీమ, ఫైన్ ఆర్ట్స్ రంగాల వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు మెండుగా వస్తాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో మీ అనుబంధం దృఢ పడుతుంది. మీరు సాధించిన విజయాలు మీకు గొప్ప పేరు ప్రతిష్ఠలు తీసుకు వస్తాయి. సుబ్రమణ్య స్వామి ఆరాధనతో ఆటంకాలు తొలగి పోతాయి.