తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు- శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం! - HOROSCOPE TODAY NOVEMBER 9TH 2024

నవంబర్ 9వ తేదీ (శనివారం) రాశిఫలాలు

Horoscope Today November 9th 2024
Horoscope Today November 9th 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 5:00 AM IST

Horoscope Today November 9th 2024 : నవంబర్ 9 వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తిపరంగా, పై అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన ప్రాజెక్టులు లాభాలు కురిపిస్తాయి. వృత్తి వ్యాపారాల నిమిత్తం వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్టదేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో రోజుల నుంచి చూడాలని అనుకుంటున్న పర్యాటక ప్రదేశాలకు వెళ్తారు. విదేశాలలో వ్యాపార విస్తరణ చేయాలనుకునేవారికి అనుకూలమైన సమయం. కొత్త వెంచర్లు, ప్రాజెక్టులు చేపట్టడానికి ఈ రోజు శుభకరంగా ఉంది. తీర్థ యాత్రల సందర్శన నుంచి ప్రేరణ పొందుతారు. విదేశీ బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిధునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తులు, భాగస్వామ్య ఆస్తులు, కుటుంబ ఆస్తికి సంబందించిన సమస్యలతో ఆందోళన చెందుతారు. సన్నిహితులతో మనస్పర్థల కారణంగా కొంత అశాంతిగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన విషయాల్లో రిస్క్ తీసుకుంటారు. డబ్భు నష్టపోయే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శివాలయ సందర్శన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విభిన్న సంస్కృతులకు చెందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాలలతో సరదాగా గడుపుతారు. విదేశాల నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఈ పరిచయం మీ భావిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులు సమర్థవంతమైన పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. పదోన్నతులు, ప్రసంశలు లభిస్తాయి. సమాజంలో పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సహచరుల, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురు కావచ్చు. పుట్టినింటి నుంచి అందిన ఒక విషాద సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. వృత్తి వ్యాపారాలలో పెరిగిన పోటీ కారణంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆర్థిక పరిస్థితి దిగజారడం ఆందోళన కలిగిస్తుంది. అన్ని వైపులా ప్రతికూలతలు కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. షేర్స్ లోనూ, స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టకండి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రశాంతత పొందవచ్చు. ప్రియమైన వారితో తీర్థయాత్రలకు పోవడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి పరమైన సమస్యలతో తీవ్రమైన మానసిక ఒత్తిడి వుంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. నీటి గండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలించవు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు, కుటుంబ వారసత్వం సంబంధించిన లీగల్ పేపర్స్​తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. శనిస్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు ఈ రోజు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ ఆవిష్కరణలకు ప్రత్యర్థులు ఖంగు తింటారు. వృత్తి పరంగా ఎదురయ్యే ఆటంకాలు సమర్థవంతంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని సంఘటనలు జరగడం వల్ల గందరగోళంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉండవచ్చు. అనారోగ్యం కారణంగా సామాన్యమైన పనులు కూడా పూర్తిచేయలేక నిరాశతో ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. ప్రధానంగా ఈ రోజంతా వృత్తిపరమైన, వ్యక్తిగత వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. శివపార్వతుల ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అయిపోతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు అనారోగ్య సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తగినంత విశ్రాంతి అవసరం. కోర్టు వ్యవహారాలు వేగంగా సాగేలా చూసుకోండి. సరైన లబ్ధి ఉండేచోట పెట్టుబడులు పెట్టండి. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. కోపం అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రియమైన వారితో వాదనలు కూడదు. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం వలన సత్ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బుద్ధిబలంతో, తెలివితేటలతో ప్రత్యర్థులను ఓడిస్తారు. కీలక వ్యహారాలలో సందర్భానుసారంగా నడుచుకుంటే మంచిది. తప్పుడు సలహాలు ఇచ్చే వారికి దూరంగా ఉండండి. సొంత నిర్ణయాలే మేలు చేస్తాయి. వినాయకుని ప్రార్థిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details