Horoscope Today 25th January 2024 : జనవరి 25న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
.
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. ఆస్తి, భూతగాదాలకు దూరంగా ఉండండి. కీలకమైన ఒప్పందాలపై ఈ రోజు సంతకాలు చేయవద్దు. విద్యార్థులు బాగా శ్రమించాలి. ఆధ్యాతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. యోగా, ధ్యానంతో మానసిక శాంతి లభిస్తుంది.
.
వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీ శక్తి, సామర్థ్యాలతో వాటిని అధిగమిస్తారు. ప్రశాంతంగా ఆలోచించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మేధోపరమైన ఆలోచనలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వ్యాపార, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారికి చాలా బాగుంటుంది. రోజంతా సంతోషంగా గడుపుతారు. నూతన గృహ ప్రవేశానికి ఇది మంచి రోజు. ప్రియమైన వ్యక్తులు మీకు ఆర్థికంగా, ఎమోషనల్గా బాగా సపోర్ట్ చేస్తారు. అనవసర పనులు చేయకపోవడం మంచిది.
.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. పాత బకాయిలు తీర్చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వినోదం కోసం బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ ధ్యానం చేయడం మంచిది.
.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా బాగా రాణిస్తారు. అనుకోని విధంగా సంపదలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు.
.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మీలోని భావనలను జీవిత భాగస్వామితో పంచుకుంటారు. మధుర క్షణాలను ఆస్వాదిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి సాదాగా గడుస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. కనుక బాగా శ్రమించాల్సి వస్తుంది. కానీ పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. సంకల్ప బలంతో అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు.
.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి ఊహించని ఘటనలు ఎదురవుతాయి. క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో లౌకికంగా వ్యవహరించాలి. గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి.
.
మకరం (Capricorn) :ఈ రోజు మకర రాశివారి తారాబలం చాలా బాగుంది. కనుక వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. మీ ప్రయత్నాలు అన్నీ విజయవంతం అవుతాయి. ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం ఫర్వాలేదు.
.
కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ మనస్సును అదుపులో ఉంచుకోవాలి.
.
మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. సాహిత్యం పట్ల చాలా ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమికులు దగ్గర అవుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కానీ జలాశయాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.