తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశులవారికి ఆర్థిక నష్టం - అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం - కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం! - HOROSCOPE TODAY

2024 డిసెంబర్​ 25వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 24 hours ago

Horoscope Today December 25th, 2024 : డిసెంబర్​ 25వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మేధోపరమైన చర్చల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సామాజిక సంబంధాలు మెరుగు పడతాయి. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. ఆర్థిక సమస్యలు రాకుండా పొదుపు ప్రణాళికలు పకడ్బందీగా వేసుకోవాలి. ఇతరుల గురించి ఆందోళన చెందడం ఆపి మీ వృత్తి పట్ల ఏకాగ్రత పెంచితే మంచిది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శ్రీ ఆంజనేయస్వామి ప్రార్థనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో తీవ్ర ఆటంకాలు ఎదురు కావచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్తే విజయం సిద్ధిస్తుంది. అవసరానికి ఆదుకునే వారు ఉంటారు. సమాజంలో అవమానం జరిగే పరిస్థితులకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక వ్యహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు, వృత్తి పరమైన సమస్యలతో మనోవేదనకు గురవుతారు. కుటుంబసభ్యులతో కలహాలు ఉండవచ్చు. ఆర్థిక నష్ట సూచన ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సహచరుల సహాయంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సన్నిహితులతో సంబంధాలు బాగుంటాయి. విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి మంగళకరమైన రోజు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. నిరంతర సాధనతో వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో సమావేశాలలో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి . ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ బుద్ధిబలంతో అధిగమిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకున్నదానికంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. విలాసాల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామ నామజపం ఉత్తమం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆపరేషన్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో గొడవకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. వినోదాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారితో అపోహలు ఏర్పడతాయి. ఆదిత్య హృదయం పారాయణతో సత్ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు లాభదాయకమైన రోజు. కుటుంబ జీవితాన్ని ఈ రోజు సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరుతో అసంతృప్తి చెందుతారు. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఆర్థిక సమస్యలు ఎదురు కావచ్చు. ఒక జటిలమైన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శక్తినిస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో అనుకోకుండా చిక్కుకుంటారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతికూల ఆలోచనలు వ్యక్తిగత జీవితానికి అవరోధంగా మారకుండా చూసుకోండి. వైద్య ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన అశాంతి కలిగిస్తుంది. దైవంపై అచంచల విశ్వాసం కలిగి ఉండడం వల్ల మేలు చేకూరుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ ధైర్యాన్నిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details