తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి​ - లేకుంటే ప్రమాదం! - శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభకరం - HOROSCOPE TODAY

నవంబర్ 20వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2024, 4:00 AM IST

Horoscope Today November 20th 2024 : నవంబర్ 20వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కటి ప్రణాళికతో పని చేస్తే మేలైన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యహారాలు అనుకూలంగా ఉంటాయి. అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉండదు. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి పెరగవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి కార్యసిద్ధి ఉంది. పని ప్రదేశంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. మీలోని పోటీతత్వం, నాయకత్వ లక్షణాలు మీకు పదోన్నతులు చేకూరుస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఈ రోజు అందుకుంటారు. కుటుంబంలో పెద్దల మాటలను గౌరవిస్తూ ముందుకెళ్తే శుభ ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చిత్తశుద్ధితో లక్ష్య సాధన కోసం కృషి చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఖర్చులు ఆదాయాన్ని మించిపోయే అవకాశం ఉంది. కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోకపోతే శత్రువులు పెరుగుతారు. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో మెరుగైన పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి పరంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అనుకూలమైన సమయం. ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా విజయం చేకూరుతుంది. ఆదాయం, ఇతర ఆర్థిక వనరుల పెరుగుదలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య స్తుతి శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి, కీర్తి వృద్ధి ఉంటాయి. సామాజికంగా మంచి గుర్తింపు పొందుతారు. సృజనాత్మకతతో పనిచేసి వృత్తిపరంగా మంచి విజయాలను అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహాలంకరణ కోసం ధనవ్యయం చేస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. గిట్టని వారు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కోసం మీరు పనిచేయడం ఈ రోజు చాలా ముఖ్యం. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోండి. వ్యతిరేక ఫలితాలు వచ్చినా ధర్యంతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. దుర్గాస్తుతి మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చెప్పే మాటలకూ చేసే పనులకు మధ్య సమతూకం పాటించడం చాలా ముఖ్యం. పనిపట్ల మీ చిత్తశుద్ధి, నైపుణ్యాలు మీకు గుర్తింపు తీసుకువస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దైవబలం రక్షిస్తోంది. శివారాధన శ్రేయస్కరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. సత్ప్రవర్తనతో, సద్బుద్ధితో గొప్పవారవుతారు. కలిసి వచ్చే కాలం సమీపించింది. నలుగురిలో గౌరవ ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంది. ఊహించని ఆర్థిక లాభాలు ఉండవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో చిత్త శుద్ధితో కృషి చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు పని పట్ల చూపే శ్రద్ధ, ప్రశంసలు కురిపిస్తంది. మీ పనితీరు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. శ్రీలక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. వృత్తిపరంగా పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details