తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు మొహమాట పడితే చిక్కుల్లో పడడం గ్యారెంటీ - శివారాధన చేయడం శ్రేయస్కరం - HOROSCOPE TODAY

నవంబర్ 19వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope
Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 4:00 AM IST

Horoscope Today November 19th 2024 : నవంబర్ 19వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్యం కారణంగా పనుల్లో శ్రద్ధ పెట్టలేకపోతారు. ఉద్యోగ, వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. వృత్తి పట్ల నిబద్ధత అవసరం. స్నేహితుల సహకారంతో నూతన ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల సమయం కాబట్టి మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. చేపట్టిన వృత్తి పట్ల గందరగోళం కారణంగా మంచి అవకాశాలను కోల్పోవచ్చు. రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వం కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. ప్రయాణం వాయిదా పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి ఇంటా, బయటా సమస్యలు పరిష్కరిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మీ లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ, గృహ లాభాలున్నాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన మేలు చేస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ బుద్ధిబలం, కార్యదక్షత కారణంగా గొప్పవారు అవుతారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. సంపదలు చేకూరుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామ నామ జపం శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి సంకోచం లేకుండా కొత్త పనులు మొదలు పెట్టండి. వృత్తి పరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన పనులు సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. శత్రుభయం ఉండవచ్చు. మీ కోపం కారణంగా మంచి అవకాశాలు చేజారిపోతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ గణపతిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు విజయం కోసం పట్టుదలతో పనిచేయాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో పోటీ కారణంగా ఒత్తిడి ఉండవచ్చు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. కొత్త స్కీములు, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. శివారాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చు ఉండవచ్చు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వస్థాన ప్రాప్తి ఉంది. లక్ష్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. కనకదుర్గ దేవి ధ్యానం మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లాభపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా లేనందున అన్ని వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల చిక్కుల్లో పడతారు. ఇబ్బంది పెట్టే వారు మీ పక్కనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details