తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి ఈరోజు తీవ్ర నష్టాలు! ఆంజనేయ స్వామి ఆరాధన మేలు! - Horoscope Today 18th September 2024 - HOROSCOPE TODAY 18TH SEPTEMBER 2024

Horoscope Today 18th September 2024 : 2024 సెప్టెంబర్ 18వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 18th September 2024
Horoscope Today 18th September 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 5:02 AM IST

Horoscope Today 18th September 2024 :2024 సెప్టెంబర్ 18వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు. సమాజంలో గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారులు బాగా రాణిస్తారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభ సమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయ సందర్శన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు వ్యాపారపరంగా అద్బుతమైన రోజు. ఊహించని లాభాలను, విదేశీ పెట్టుబడులను అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో గతంలో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు. ఉన్నతాధికారాలు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. సమాజంలో పేరు, ప్రఖ్యాతలు, గుర్తింపు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఊహించని విధంగా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంబిస్తే మంచిది. విలాసాల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా లేనందున చేసే ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో రుణభారం పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇతరుల మనసు బాధపడేలా పరుషంగా మాట్లాడవద్దు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల సంతోషంగా ఉంటారు. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యాపారంలో భాగస్వాములతో కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. ఆశించిన లాభాలను అందుకుంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల, ప్రమోషన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శ్రేయస్కరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక, స్థిరాస్తి పెట్టుబడులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడుల నుంచి భవిష్యత్​లో మంచి ప్రయోజనాలు, లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు, నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంపాదన వృద్ధి చెందుతుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి పనిభారం పెరగడం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులు ఆశించిన ప్రమోషన్ పొందాలంటే తీవ్రమైన కృషి అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గిట్టని వారి విమర్శలు పట్టించుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం కష్టతరమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాలవారు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. వృత్తి వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తారు. ఏ పని చేపట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడం, పదోన్నతులు వంటి శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఈ రోజంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు. సానుకూల దృక్పథంతో, మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విజయ మార్గంలో ఎదురయ్యే అవరోధాలను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టం సంభవించే సూచన ఉంది కాబట్టి ఆచి తూచి వ్యవహరించాలి. ధ్యానం, యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంతత పొందవచ్చు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకు అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే కలహాలు ఉండవు. అభయ ఆంజనేయ స్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details