తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు పట్టుదలతో కృషి చేస్తే విజయం గ్యారెంటీ - శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం! - DAILY HOROSCOPE

నవంబర్ 17వ తేదీ (ఆదివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 4:01 AM IST

Horoscope Today November 17th 2024 : నవంబర్ 17వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం చేయండి. సన్నిహితులతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. వృత్తి పరంగా శుభ ఫలితాల కోసం అభయ ఆంజనేయ స్వామిని ప్రార్ధించండి.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. వృత్తి పరంగా చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్య సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాలవారు సమయానుకూలంగా నడుచుకుంటే వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కుటుంబ సభ్యులతోనూ , స్నేహితులతోనూ అనవసరమైన వివాదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా లాభపడతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్థులు పదోన్నతులు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సరదాగా గడుపుతారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో కార్యసిద్ధి, ఆర్థిక వృద్ధి ఉంటాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసమే ఆయుధాలుగా ఈ రోజు అన్ని పనులలో అవలీలగా విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎలాంటి ఆటంకాలు, సవాళ్లు లేని ప్రశాంతమైన రోజు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సహచరుల సహకారం ఉంటుంది. స్నేహితుల సహాయంతో ఆర్థికంగా ఎదుగుతారు. వ్యాపారంలో పెరిగిన పోటీని సునాయాసంగా అధిగమిస్తారు. విదేశీ బంధువుల నుంచి అందిన శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా కాదు. మితిమీరిన కోపావేశాల కారణంగా తీవ్రంగా నష్టపోతారు. మీ మొండి వైఖరి కారణంగా వృత్తి పరంగా గొప్ప అవకాశాలు చేజారిపోతాయి. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. సమస్యలు తీరాలంటే ఆధ్యాత్మ సంబంధమైన ప్రార్థన ధ్యానాది కార్యక్రమాలు చేయడం మంచిది. అందువల్ల సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. అనైతికమైన, చట్ట విరుద్ధమైన పనులు చేయకండి. ఆర్థిక అంశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగిపోవడం వల్ల ఆనందంగా ఉంటారు. పనిఒత్తిడి నుంచి విరామం తీసుకొని కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ ఒక్కసారిగా కలిసి వస్తాయి. ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో సమన్వయ ధోరణి ఉండడం వల్ల రోజంతా చురుగ్గా వ్యవహరిస్తారు. పని ప్రదేశంలో సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. మాతృ వర్గం నుంచి ధనలాభం ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు అన్ని రంగాల వారికి తమ రంగాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అసంతృప్తి కలిగిస్తుంది. రుణంగా ఇచ్చిన ధనం తిరిగి రాక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటే ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఈశ్వరుని ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో సరైన అవకాశాలు లేక నిరాశతో ఉంటారు. ఆర్ధిక సమస్యలతో మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంతానం అభివృద్ధి సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి మంచిరోజు. సానుకూల ఆలోచనలతో సంతోషంగా ఉంటారు. వృత్తి పరంగా కీలకమైన చర్చలలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధలు తీరిపోతాయి. కొంతమంది బంధువుల ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details