తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు- ఇష్ట దేవతారాధన మరింత మేలు - DAILY HOROSCOPE IN TELUGU

2024 డిసెంబర్​ 17వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Horoscope Today December 17th 2024 : డిసెంబర్​ 17వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉన్నదానితో సంతృప్తి చెందే మీ మనస్తత్వంతో మానసికంగా సంతోషంగా ఉంటారు. మీ లక్ష్య సాధన వైపు సూటిగా ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకుంటారు. కుటుంబ సౌఖ్యం, ఆర్ధిక వృద్ధి ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఈ రోజు తీరిక లేకుండా ఉంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్ధిక వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తీరిక లేని షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకొని సరదాగా గడపండి . స్నేహితులు, కుటుంబసభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఆర్ధిక సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే మీ శక్తియుక్తులను ఒక్కచోటికి చేర్చి కష్టపడాల్సి ఉంటుంది. కోపావేశాలను అదుపులో ఉంచుకోండి. ధ్యానంతో ప్రశాంతత నెలకొంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఇంటికి బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. అభయ ఆంజనేయస్వామి ఆరాధన శుభకరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయాలు జాప్యం చేస్తే మంచి అవకాశాలు కోల్పోవచ్చు. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. శ్రీ దుర్గాదేవి ధ్యానం శుభప్రదం.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో సవాళ్లతో పాటు పనిభారం కూడా అధికంగా ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకొని ప్రశాంతంగా గడపటం మేలు చేస్తుంది. సహనంగా ఉంటే వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోగలరు. వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ శక్తి సామర్ధ్యాలతో, ప్రతిభాపాటవాలతో అందరిని ఆకర్షిస్తారు. అన్ని రంగాల వారు తాము పనిచేసే రంగంలో సామర్ధ్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇతరులను ఆకట్టుకుంటారు. కళాత్మక విషయాలపై అభిరుచి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒత్తిడిని, సవాళ్ళను సమర్ధవంతంగా అధిగమిస్తారు. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. ఒత్తిడిని పారదోలేందుకు యోగా, ధ్యానం చేయడం మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం మేలు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు మీరు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కష్టాలు ఎల్లకాలం ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ కార్యదక్షతతో, తెలివితేటలతో అన్ని సమస్యలను అధిగమిస్తారు. సన్నిహితులు, ప్రియమైన వారి సలహాలు మేలు చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పనులు జోరుగా సాగుతాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాపారం సాగుతుంది. భాగస్వాములు, సహోద్యోగులు సహకరిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తిరీత్యా ఈ రోజు చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎదుటివారి బలహీనతను బలంగా మార్చుకునే సామర్ద్యంతో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఆరంభిస్తే ఫలవంతంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు పని ప్రదేశంలో గట్టి పోటీ ఉంటుంది. పదోన్నతలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సన్నిహితులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారస్తులకు ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details