Chiranjeevi Anil Ravipudi Movie : టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. 'ఎఫ్ 3', భగవంత్ కేసరి ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరు ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట. షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు అనిల్ తెరకెక్కించిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన కథాంశంతో అలాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానుందని, ఇందులో చిరంజీవి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా ఈ సినిమా పట్టాలెక్కనుంట. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చిరు ఇటీవలే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. నాని సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో సాగనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం అనిల్ సినిమా పూర్తయిన తర్వాత మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
ఇక అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' తర్వాత వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్ల అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఈ కాంబోలో వచ్చిన సినిమాలు కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకున్నాయి. ఇక అనిల్ తెరకెక్కించిన భగవంత్ కేసరి కూడా సెంటిమెంట్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో అనిల్ అప్‌కమింగ్ మూవీస్‌పై మూవీ లవర్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.
నాని సమర్పణలో చిరు మూవీ - యంగ్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్ ఫిక్స్!
'సంక్రాంతికి వస్తున్నాం' అంటున్న వెంకీ మామ - ఇంట్రెస్టింగ్గా మూవీ టైటిల్!